STOCKS

News


జనవరి నుంచి ఫోక్స్‌వ్యాగన్‌ కార్ల ధరల పెంపు

Saturday 8th December 2018
news_main1544240177.png-22744

ముంబై: ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, తయారీ వ్యయాలు పెరిగిపోవడమే ధరలు పెంచడానికి కారణమని పేర్కొంది. ఈ కారణాల వల్ల తప్పనిసరై ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్యాసింజర్‌ కార్ల విభాగం డైరెక్టర్‌ స్టీఫెన్‌న్యాప్‌ తెలిపారు. మారుతి సుజుకి, టయోటా, ఇసుజు మోటార్స్‌ ఇప్పటికే ధరలను పెంచాయి. 



You may be interested

నవంబర్‌లో జేఎల్‌ఆర్‌ విక్రయాలు 8% డౌన్‌

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జేఎల్‌ఆర్‌ కార్ల విక్రయాలు నవంబర్‌లో 8 శాతం తగ్గిపోయాయి. 48,160 కార్లను సంస్థ విక్రయించింది. చైనా, ఇతర ప్రధాన మార్కెట్లలో అమ్మకాల పరంగా ఉన్న సవాళ్లు ప్రభావం చూపించినట్టు కంపెనీ తెలిపింది. జాగ్వార్‌ బ్రాండ్‌ రిటైల్‌ అమ్మకాలు 8.9 శాతం పెరిగి 14,909 యూనిట్లుగా ఉన్నాయి. ల్యాండ్‌రోవర్‌ బ్రాండ్‌ కార్ల అమ్మకాలు 33,251 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14 శాతం

'ర్యాన్‌బాక్సీ' సింగ్ బ్రదర్స్ బాహాబాహీ!!

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: ఒకప్పటి ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. తాజాగా తమ్ముడు శివీందర్ సింగ్ తనపై దాడి చేశారంటూ అన్న మల్వీందర్ సింగ్ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. డిసెంబర్ 5న శివీందర్ సింగ్ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ

Most from this category