News


ఈ కంపెనీల నుంచి త్వరలో భారీ డివిడెండ్‌?

Sunday 13th January 2019
Markets_main1547404006.png-23558

ప్రభుత్వరంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరింత మొత్తంలో డివిడెండ్‌ను వాటాదారులకు పంపిణీ చేయబోతున్నాయి. ఏడు ప్రభుత్వరంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం డివిడెండ్‌ రూపంలోనే రూ.21,000 కోట్లను ఆశిస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఈ ఏడు కంపెనీల వద్ద 2018 మార్చి చివరికి నగదు నిల్వలు రూ.54,235 కోట్ల మేర ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది. అదే సమయంలో నికర రుణ భారం కేవలం రూ.2,943 కోట్లుగానే ఉందని తన నివేదికలో పేర్కొంది.

 

కోల్‌ ఇండియా, హిందుస్తాన్‌ ఎరోనాటిక్స్‌, ఎన్‌ఎండీసీ, రైట్స్‌, ఇంజనీర్స్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎంవోఐఎల్‌ సంస్థలు 2018 మార్చి నాటికి తమ దగ్గరున్న నగదు నిల్వలను అధిక డివిడెండ్‌ చెల్లింపులకు ఖర్చు చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయ లక్ష్యం కోసం సహకరించడమే ఇందులోని పరమార్థం. ఈ సంస్థల నుంచి రూ.21,097 కోట్ల మేర కేంద్రానికి డివిడెండ్‌ అందనుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతానికి (రూ.6.24 లక్షల కోట్లు) పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్టుకుంది. దీన్ని చేరుకునే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ కార్యక్రమాలను కూడా చేపట్టిన విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం రూపంలో రూ.80,000 కోట్లు సమీకరించాలనేది కేంద్రం లక్ష్యం. అయితే, ఇందులో సగం మేర ఇప్పటి వరకు సమకూరడంతో మిగిలిన మూడు నెలల్లో భారీగా సమకూర్చుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీంతో షేర్ల బైబ్యాక్‌, అధిక డివిడెండ్‌ చెల్లించాలంటూ సర్కారు నుంచి ఒత్తిడి వస్తూనే ఉంది. ఎన్‌ఎండీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఆల్‌ ఇండియా, బీహెచ్‌ఈఎల్‌, నాల్కో, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్‌ ఇప్పటికే బైబ్యాక్‌ కార్యక్రమాలను చేపట్టాయి. ఐవోసీ ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ కూడా చెల్లించింది. కోల్‌ ఇండియా, రైట్స్‌ కూడా త్వరలోనే మధ్యంతర డివిడెండ్‌పై ప్రకటన చేయనున్నాయి. చారిత్రకంగా చూస్తే వీటి నుంచి అధిక డివిడెండ్‌ ప్రకటన వెలువడచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దీంతో, ఈ కంపెనీల్లో సాధారణ ఇన్వెస్టర్లకూ డివిడెండ్‌ వర్షం కురవనుంది.You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్త పెట్టుబడుల హవా

Sunday 13th January 2019

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల ప్రవేశం, నూతన పెట్టుబడులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయి. డిసెంబర్‌లో కొత్తగా 5.7 లక్షల పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) ప్రారంభమవడం ఇదే సూచిస్తోంది. సెబీ గణాంకాల ప్రకారం... 2018 డిసెంబర్‌ ఆఖరుకు మొత్తం ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్య 8.03 కోట్లుగా ఉంది.    గతేడాది నవంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) కొత్తగా 7.05 లక్షల ఫోలియోలను యాడ్‌ చేసుకున్నాయి. అక్టోబర్‌లో 11.5 లక్షల మేర

ఇరాన్‌ చమురు దిగుమతులపై కొత్త సడలింపులుండవు!

Saturday 12th January 2019

అమెరికా స్పష్టీకరణ ఇరాన్‌ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవాలనుకునేదేశాలకు ఇకపై కొత్తగా నిబంధనల సడలింపు ఉండదని యూఎస్‌ తేల్చిచెప్పింది. ఇరాన్‌పై ఆంక్షల అనంతరం భారత్‌తో సహా 8 దేశాలకు అమెరికా కొద్దిపాటి సడలింపు ఇచ్చింది. అయితే ఇకపై కొత్తగా ఇలాంటి సడలింపులేవీ ఉండవని యూఎస్‌ ప్రతినిధి హుక్‌ చెప్పారు. ఇప్పటికే వేవియర్స్‌ పొందిన దేశాలకు సదరు సడలింపు గడువు మేతో ముగియనుంది. ఆపై వీటి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో హుక్‌

Most from this category