STOCKS

News


యూకో బ్యాంక్‌ నష్టాలు రూ.634 కోట్లు

Saturday 11th August 2018
news_main1533956892.png-19154

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.634 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.663 కోట్లు, సీక్వెన్షియల్‌గా వచ్చిన నష్టాలు రూ.2,134 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో నికర నష్టాలు తగ్గాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.4,237 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,361 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 
మరింత అధ్వానంగా రుణ నాణ్యత...
బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా దిగజారింది. గత క్యూ1లో రూ.25,054 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.29,786 కోట్లకు పెరిగాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. నికర మొండి బకాయిలు రూ.12,011 కోట్ల నుంచి రూ.12,558 కోట్లకు చేరాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 19.87 శాతం నుంచి 25.71 శాతానికి, నికర మొండి బకాయిలు  10.63 శాతం నుంచి 12.74 శాతానికి పెరిగాయని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,204 కోట్ల నుంచి రూ.2,038 కోట్లకు పెరిగాయని వివరించింది. మొండి బకాయిలకు సంబంధించిన ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 65.15 శాతానికి చేరిందని పేర్కొంది. నికర నష్టాలు మరింతగా పెరగడం, రుణ నాణ్యత తగ్గడం వంటి కారణాల వల్ల బీఎస్‌ఈలో యూకో బ్యాంక్‌ షేర్‌ 3.2 శాతం నష్టంతో రూ.19.45 వద్ద ముగిసింది. 



You may be interested

రెట్టింపైన హిందాల్కో లాభం

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో... స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.734 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.364 కోట్లుగా  కోట్లతో పోల్చితే 102 శాతం వృద్ధి సాధించామని హిందాల్కో తెలిపింది. ఇబిటా  అధికంగా ఉండటం, తక్కువ వడ్డీ వ్యయాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ...

Saturday 11th August 2018

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎ౾ంఆర్‌ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల కాంట్రాక్టులను ఎల్ అండ్‌ టీ, మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్టు విలువ రూ.3,028 కోట్లు కాగా మెగావైడ్‌ దక్కించుకున్న కాంట్రాక్టు విలువ రూ.980 కోట్లు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ మేరకు రెండు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.

Most from this category