STOCKS

News


వైజాగ్‌లో చైనా సంస్థ ట్రినాసోలార్ తయారీ ప్లాంట్‌

Saturday 15th September 2018
news_main1536987882.png-20279

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ట్రినా సోలార్‌ సంస్థ భారత్‌లో సౌర విద్యుత్ పరికరాల తయారీ ప్లాంటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు, తయారీదారులు, డెవలపర్లతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యిన్‌ రోంగ్‌ ఫాంగ్ తెలిపారు. 3,5,10 కి.వా. సామర్ధ్యం గల ట్రినాహోమ్ సౌర ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ట్రినాసోలార్‌.. తమ తయారీ ప్లాంటు కోసం 2015లోనే వైజాగ్‌లో స్థలం కొనుగోలు చేసింది. అప్పట్లో వార్షికంగా 500-700 మెగావాట్ల సోలార్ పరికరాల సామర్ధ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయాలని భావించింది. అయితే, భారత మార్కెట్‌ పరిమాణం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్లాంటు సామర్ధ్యాన్ని కూడా మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఫాంగ్ పేర్కొన్నారు. దీనికి సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. 



You may be interested

ఆధార్ డెడ్‌లైన్ పెంచండి

Saturday 15th September 2018

న్యూఢిల్లీ:  దరఖాస్తుదారుల ఫేస్ ఆథెంటికేషన్‌ ఫీచర్‌ను అమలు చేసేందుకు మరింత సమయం కావాలని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ (యూఐడీఏఐ)ని మొబైల్ ఆపరేటర్లు కోరారు. ఇందుకు అవసరమైన బయోమెట్రిక్ డివైజ్‌లు తయారు చేసే సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫేస్‌ ఆథెంటికేషన్‌ అమలుకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 15తో ముగిసిపోనున్న నేపథ్యంలో యూఐడీఏఐకి ఆపరేటర్ల ఫోరం (యాక్ట్‌) ఒక లేఖ రాసింది. దీన్ని అమలు

భారీగా తగ్గిన క్వాలిటీ నికర లాభం

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: డెయిరీ ఉత్పత్తుల కంపెనీ క్వాలిటీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.28 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ1లో రూ.కోటికే పరిమితమైనట్లు క్వాలిటీ తెలిపింది. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండటమే నికర లాభం భారీగా తగ్గడానికి కారణమని వివరించింది. గత క్యూ1లో రూ.1,573 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ1లో రూ.1,266 కోట్లకు

Most from this category