News


10,620 పైన ముగిసే వరకు లాంగ్స్‌ వద్దు..!

Saturday 10th November 2018
Markets_main1541827189.png-21838

ముంబై: శుక్రవారం ఉదయం 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. అంతక్రితం ముగింపుతో పోల్చితే 17 పాయింట్ల లాభంతో ప్రారంభమైన ఈ ప్రధాన సూచీ.. ఇంట్రాడేలో 10,619 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని, 10,545 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. న్యారోరేంజ్‌లో కొనసాగి ముగింపు సమయానికి 10,600 స్థాయిని అధిగమించలేకపోయింది. అయితే, ఈ సూచీ డైలీ చార్టులో హామర్‌ క్యాండిల్‌ను ఏర్పాటుచేయడం ద్వారా దిగువస్థాయిలో కొనుగోలును సూచిస్తుందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు చందన్ తపరియా వివరించారు. వారం మొత్తంలో 10,450-10,650 శ్రేణిలో కదలాడిన నిఫ్టీ ఇదే స్థాయిలో కన్సాలిడేట్‌ అవ్వడం వల్ల ఏవైపునకు వెళ్లలేకపోయిందన్నారు. 10,650 -10,750 పాయింట్ల దిశగా నిఫ్టీ అప్‌మూవ్‌ జరగాలంటే.. 10,500 మార్కును కోల్పోకుండా ఉన్నంతకాలమే ఇందుకు ఆస్కారం ఉందన్నారయన. నిఫ్టీకి ఈ స్థాయి తరవాత 10,450 పాయింట్లు, ఆ తరువాత 10,380 కీలకమద్దతుస్థాయిలుగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక బ్రీతర్‌ తరహా పాట్రన్‌ ఏర్పాటుకావడం ఆధారంగా సూచీ ముందుకు కదిలే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నాగరాజ్ షెట్టి విశ్లేషించారు. సాధారణంగా ఈ పాట్రన్‌ ఏర్పాటైతే అప్‌మూవ్‌లో తాత్కాలిక నిలుపుదల చోటుచేసుకుంటుందని.. అయితే, ప్రస్తుత చార్టులలోని పరిణామాలను చూస్తుంటే ఈ పాట్రన్‌ కొనసాగింపును సూచిస్తుందన్నారు. స్వల్పకాలానికి రేంజ్‌ బౌండ్‌లో ఉండి.. వచ్చే వారాల్లో బ్రేకవుట్‌ సాధించే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. 

నిఫ్టీ 10,620 పాయింట్ల పైన ముగిసి, అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించే వరకు ట్రేడర్లు లాంగ్‌ వైపు వెళ్లకపోవడమే మంచిదని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ అన్నారు. ప్రస్తుత మార్కెట్‌ నిర్దేశిత దిశలో కాకుండా, ఒక దిశా అనేది లేకుండా ప్రయాణిస్తున్నందున ట్రేడర్లు స్టాక్‌ స్పెసిఫిక్‌గా ఉండడం మంచిదన్నారు. రెండు వైపులా అవకాశాలను చూడడం మంచిదని సూచించారు. మార్కెట్‌కు దిశ వచ్చేవరకు ఇదే స్ట్రాటజీని పాటించడం బెటరని విశ్లేషించారు.

ఇవి కేవలం విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


BSE

You may be interested

టైటాన్‌ నికర లాభం రూ.301 కోట్లు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌​ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.301 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ2లో రూ.278 కోట్ల నికర లాభం వచ్చిందని, ఈ క్యూ2లో 8 శాతం వృద్ధి సాధించామని టైటాన్‌ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,603 కోట్ల నుంచి రూ.4,595 కోట్లకు పెరగిందని టైటాన్‌ సీఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ చెప్పారు. జ్యుయలరీ విభాగం ఆదాయం 29

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Saturday 10th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 10,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం నాటి ముగింపు స్థాయి 10,623 పాయింట్లతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే.. అప్పుడు నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

Most from this category