STOCKS

News


జైట్లీపై ‘పిల్‌’ను కొట్టేసిన సుప్రీం

Saturday 8th December 2018
news_main1544239975.png-22742

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూలధన నిల్వలకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై దాఖలయిన ఒక​ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన ఎం.ఎల్‌.శర్మ అనే న్యాయవాదికి రూ.50,000 కాస్ట్‌ను కూడా సుప్రీం విధించడం గమనార్హం. ఈ మొత్తం డిపాజిట్‌ చేసే వరకూ శర్మ ఎటువంటి పిల్‌ దాఖలు చేయలేరని, అందుకు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీని బెంచ్‌ ఆదేశించింది.  పిల్‌ వేయడానికి తగిన కారణమేమీ కనిపించడం లేదని, పైగా ఆర్థికమంత్రినే ఈ పిల్‌లో ప్రధాన పార్టీని చేయడం తగదని ప్రధాన న్యాయమూర్తి రాజన్‌ గగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది .పిల్‌ను చూస్తుంటే, ఆర్థికమంత్రే డబ్బు కాజేస్తున్నట్లు ఉందని  వ్యాఖ్యానించింది.  తొలుత సుప్రీం కాస్ట్‌ విధించలేదు. పిల్‌ను కొట్టివేసిన తర్వాత కూడా న్యాయవాది తన వాదనలను కొనసాగించడంతో న్యాయస్థానం సంబంధిత కాస్ట్‌ విధించింది.  



You may be interested

'ర్యాన్‌బాక్సీ' సింగ్ బ్రదర్స్ బాహాబాహీ!!

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: ఒకప్పటి ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. తాజాగా తమ్ముడు శివీందర్ సింగ్ తనపై దాడి చేశారంటూ అన్న మల్వీందర్ సింగ్ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. డిసెంబర్ 5న శివీందర్ సింగ్ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ

ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఐఎస్‌బీ ప్రొఫెసర్‌

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రొఫెసర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిని (సీఈఏ) ఈ ఏడాది జూలైలో వీడగా, అప్పటి నుంచి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు ఐఎస్‌బీ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమించాలన్న

Most from this category