STOCKS

News


బుల్‌ మార్కెట్‌కు ఇది ముగింపు కాదు: దమానీ

Saturday 10th November 2018
Markets_main1541830851.png-21861

ప్రస్తుత కరెక్షన్‌లో మార్కెట్‌ తీరును గమనిస్తే... ఇది బుల్‌ మార్కెట్లో వచ్చిన విరామమే కానీ, బుల్‌ మార్కెట్‌కు ముగింపు కాదని తాను భావిస్తున్నట్టు ప్రముఖ ఇన్వెస్టర్‌ రమేష్‌ ధమానీ తెలిపారు. మార్కెట్‌ ప్రతికూల వార్తలను పట్టించుకోవడం లేదన్నారు. ఇండిగో చాలా దారుణమైన ఫలితాలను ప్రకటించినా గానీ స్టాక్‌ 25 శాతం పెరిగినట్టు దమానీ తెలిపారు. ఇది బుల్‌ మార్కెట్లోనే సాధ్యమంటూ ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  

మార్కెట్‌ ట్రెండ్‌

ఆటుపోట్లు కచ్చితంగా ఉంటాయని దమానీ అన్నారు. నిఫ్టీ 10,000 స్థాయికి వెళ్లిన తర్వాత సాంకేతికంగా స్పందించిన తీరును గుర్తు చేశారు. ప్రతికూల వార్తలను సైతం స్టాక్స్‌ పట్టించుకోకుండా ర్యాలీ చేస్తున్నాయని చెప్పారు. ఉదాహరణకు ఇండిగో చాలా చెత్త ఫలితాలను ప్రకటించినా గానీ కనిష్ట స్థాయి నుంచి 25 శాతం వరకు పెరిగినట్టు తెలిపారు. అలాగే, మంచి ఫలితాలకూ స్టాక్స్‌ స్పందిస్తున్నాయని, మార్కెట్‌కు అనుగుణంగా నడుస్తున్నాయన్నారు. ‘‘ఏ, బీ గ్రూపు స్టాక్స్‌లో కొన్ని 52 వారాల గరిష్ట స్థాయిలను సైతం నమోదు చేస్తున్నాయి. ఈ తరహా వాతావరణం బేరిష్‌ మార్కెట్‌లో ఉండదు. కేవలం బుల్లిష్‌ మార్కెట్లోనే సాధ్యం. కనుక సాంకేతికంగా చూస్తే తిరిగి 11,700 స్థాయికి మార్కెట్‌ వెళుతుందని తెలుస్తోంది. కాకపోతే వెంటనే కాదు. ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో జరగొచ్చు. ఐదేళ్ల క్రితం ఆరంభమైన బుల్‌ మార్కెట్‌ ఇప్పటికీ ఆశావహంగానే ఉంది’’ అని ధమానీ తెలిపారు.

వేటికి ప్రాధాన్యం... 

ఈ తరహా మార్కెట్లలో అన్నింటినీ ఒకే గాటన కడుతుంటారని ధమానీ పేర్కొన్నారు. దాదాపు అన్ని స్టాక్స్‌ 20-30 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయని, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలో చక్కని కంపెనీలు ఒకే అంకె పీఈకి పడిపోయినట్టు చెప్పారు. కనుక వచ్చే రెండు మూడేళ్లలో కొనుగోళ్లకు దిగకుండా ఉండేందుకు కారణం కనిపించడం లేదన్నారు. తాను మాత్రం మార్కెట్లో పూర్తిగా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నానని, పెద్దగా నగదు లేదని చెప్పారు. ‘‘కాకపోతే కొన్ని పాత హోల్డింగ్స్‌ను విక్రయించాను. కొత్తవి కొంటున్నారు. అందులోనూ బాగా పడిపోయినవే. వచ్చే రెండేళ్లలో మంచి వృద్ధి అవకాశాలు ఉండి, మంచి డివిడెండ్‌ ఇచ్చే వాటికే ప్రాధాన్యం. రంగాల వారీ కాకుండా విడిగా చాలా ఆకర్షణీయంగా ఉన్న వాటివైపే నా దృష్టి. అస్సెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రానున్న కొన్నేళ్లలో మంచి పనితీరు ప్రదర్శిస్తాయి. రిటైల్‌ కంపెనీల్లోనూ కొన్ని ఇంతే పనితీరు చూపిస్తాయి. అయితే, నేను మాత్రం రంగాల వారీగా కాకుండా విడిగా, 30-50-70 శాతం స్థాయిలో పడిపోయిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అని దమానీ తెలిపారు. You may be interested

ప్రభుత్వరంగ స్టాక్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి

Saturday 10th November 2018

అధిక డివిడెండ్‌ రాబడి, షేర్ల బైబ్యాక్‌లు, సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ఇవన్నీ కలసి ప్రభుత్వరంగ కంపెనీల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగిపోతోంది. మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఉండడంతో ఈ సమయంలో ప్రభుత్వరంగ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు భద్రంగా భావిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ సెప్టెంబర్‌ 21 నుంచి చూస్తే కేవలం 2 శాతమే పడిపోవడం ఇందుకు నిదర్శంగా చెబుతున్నారు. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌ ఏడు శాతం

రెరా ఫలాలు 2020 తర్వాతే!

Saturday 10th November 2018

సాక్షి, హైదరాబాద్‌: మొక్క నాటగానే రాత్రికి రాత్రే చెట్టుగా పెరిగి.. ఫలాలను ఇవ్వదు. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కూడా అంతే! ప్రస్తుతం దేశంలో రెరా శైశవ దశలో ఉంది. దాని ప్రయోజనాలు పొందాలంటే రెండేళ్ల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. నిర్మాణంలో నాణ్యతతో మొదలుకుంటే గడువులోగా ప్రాజెక్ట్‌ల పూర్తి, లావాదేవీల్లో పారదర్శకత, వాస్తవ వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు.. వంటివి రెరాతో సులభమవుతాయి. 2020 తొలి త్రైమాసికం నుంచి

Most from this category