STOCKS

News


ఇండియాలోకి టెస్లా!

Saturday 16th March 2019
news_main1552734357.png-24646

ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది పక్కా
ఎలన్‌మస్క్‌
ప్రపంచ ప్రఖ్యాత టెస్లా కంపెనీని ఇండియాలో కూడా విస్తరిస్తామని ఎలన్‌ మస్క్‌ చెప్పారు. ఈఏడాదే ఇండియాలోకి వచ్చేందుకు యత్నిస్తామని, కుదరకపోతే వచ్చే ఏడాది తప్పకవస్తామని టెస్లా సీఈఓ ట్విటర్‌లో చెప్పారు. భారత్‌లో కాలుమోపేందుకు టెస్లా గతంలో యత్నించింది. అయితే ఇక్కడి విధాన పాలసీలు కఠినంగా ఉన్నాయని గతేడాది మస్క్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు మస్క్‌ను ఒప్పించాలని మోదీ ప్రభుత్వం చాలాయత్నాలు చేసింది. కానీ కొన్ని విధానపరమైన నియంత్రణా నియమాలు తమకు అడ్డుగా ఉన్నాయని ఆ సమయంలో మస్క్‌ చెప్పారు. తాను ఫ్యాక్టరీ ఆరంభించేవరకు దిగుమతి పెనాల్టీలు విధించకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని మస్క్‌ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది జనవరిలో టెస్లా కంపెనీ యూఎస్‌కు బయట తొలిసారి చైనాలో ఫ్యాక్టరీని 500 కోట్ల డాలర్లతో ఏర్పరిచింది. నాలుగేళ్ల ప్లానింగ్‌ తర్వాత ఈ ఫ్యాక్టరీ ఆరంభమైంది. భారత్‌లో ఇ- వాహనాలకు సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా ఉండడం, చార్జింగ్‌ స్టేషన్లు విరివిగా లేకపోవడం తదితర కారణాలతో టెస్లా లాంటి కంపెనీలు ఇండియాలోకి వచ్చేందుకు ఒకటికిరెండు మార్లు ఆలోచిస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం దాదాపు 13.5 లక్షల ఇ- వాహనాలుండగా, భారత్‌లో కేవలం 6వేల వాహనాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసమే టెస్లాను ఇండియాలోకి రాకుండా ఆపుతోంది. 



You may be interested

ఇంకొక్కసారి పెంచిన తర్వాత విరామం!?

Saturday 16th March 2019

ఫెడ్‌ వడ్డీరేట్ల పాలసీపై నిపుణుల అంచనా గతంలో చెప్పినట్లు ఒక్కనెల కాకుండా మరికొంత కాలం ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచకపోవచ్చని, మూడో త్రైమాసికం వరకు వేచిచూడవచ్చని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యు3లో ఒకసారి రేట్లు పెంచినతర్వాత మరలా వేచిచూసే ధోరణిని అవలంబిస్తుందని రాయిటర్స్‌ పోల్‌లో పలువురు భావించారు. దాదాపు 100 మంది అనలిస్టులు ఈ పోల్‌లో పాల్గొన్నారు. ఫెడ్‌ చైర్మన్‌ సైతం రేట్ల పెంపునకు తాము ఎలాంటి తొందరపడడం లేదని

సుస్థిర ప్రభుత్వ ఆశలతో సెంటిమెంట్‌లో రికవరీ

Saturday 16th March 2019

మార్కెట్లపై సీఎల్‌ఎస్‌ఏ రాబోయే ఎన్నికల్లో స్థిరప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లో తాజాగా సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారేందుకు దోహదం చేశాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందన్న ఊహాగానాలతో పెట్టుబడి సెంటిమెంట్‌ పునరుజ్జీవమవుతోందని తెలిపింది. తాజా ఒపీనియన్‌పోల్స్‌లో బీజేపీ సీట్ల సంఖ్య మరో 30-40 వరకు పెరిగిందని తెలిపింది. దీంతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో కీలకమైన ప్రీపోల్‌ సర్దుబాటును బీజేపీ ప్రకటించిందని, దీంతో 6- 10 సీట్లలో గెలుపు

Most from this category