STOCKS

News


సుంకాల పెంపుతో దిగుమతులు భారం

Saturday 13th October 2018
news_main1539409574.png-21110

న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగించే కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల దిగుమతుల వ్యయాలు దాదాపు పది శాతం మేర పెరిగిపోతాయని సెల్యులార్‌ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. అయితే, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోఏఐ తెలియజేసింది. సాధారణంగా ఆపరేటర్లు ఏటా దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువ చేసే నెట్‌వర్క్‌ పరికరాలను దిగుమతి చేసుకుంటారని, గత రెండు త్రైమాసికాల్లో దాదాపు 2-3 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు జరిగి ఉంటాయని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. కొత్తగా సుంకాల పెంపుతో దిగుమతుల వ్యయాలు 10 శాతం మేర పెరగవచ్చని చెప్పారు. బేస్‌ స్టేషన్స్‌ సహా కొన్ని కమ్యూనికేషన్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 20 శాతం దాకా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మాథ్యూస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



You may be interested

సాధారణ వ్యాధి ఉందని క్లెయిమ్‌ ఇవ్వరా?

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: సాధారణ జీవనశైలి వ్యాధి ఉందని చెప్పి బీమా పరిహారాన్ని తిరస్కరించడం కుదరదని వినియోగదారుల వివాదాల పరిష్కార జాతీయ కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఎల్‌ఐసీని ఆదేశించింది. అలాగే, ఖర్చుల కింద మరో రూ.30,000 కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో పంజాబ్‌ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పును పక్కన పెట్టింది. నీలమ్‌ చోప్రా భర్త 2003లో ఎల్‌ఐసీ నుంచి

4 కంపెనీల ఆస్తులు వేలం వేయనున్న సెబీ

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్మును రాబట్టే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నాలుగు కంపెనీల ఆస్తులను వేలం వేయనుంది. స్వర్ ‍ఆగ్రోటెక్‌, లైఫ్‌ కేర్ ఇన్‌ఫ్రాటెక్‌, సర్వ్‌హిట్ హౌసింగ్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రాఘవ్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన ఆరు ప్రాపర్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర మొత్తం రూ. 4.74 కోట్లుగా సెబీ నిర్ణయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఈ ఆస్తులను నవంబర్ 11న

Most from this category