STOCKS

News


మళ్లీ రూ.8 లక్షల కోట్ల క్లబ్‌లోకి టీసీఎస్‌

Wednesday 17th April 2019
Markets_main1555491325.png-25186

దేశీయ ఐటీ సేవల రంగంలో అగ్రగామి సంస్థ వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మళ్లీ రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ క్లబ్‌లోకి చేరుకుంది.  ఈ షేరు గత రెండు రోజుల్లో 5 శాతానికిపైగా ర్యాలీ జరపడంతో మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ మంగళవారం రూ.8లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది తొలిసారిగా ఈ క్లబ్‌లోకి చేరిన టీసీఎస్‌... కొద్ది నెలల క్రితం ఈ ట్యాగ్‌ను కోల్పోయింది.  తిరిగి నిన్న బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు 1.06శాతం లాభపడి రూ.2132.45ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8.017లక్షల కోట్లకు చేరుకుంది. టీసీఎస్‌ గతవారం మార్కెట్‌ చివరిరోజైన శుక్రవారం గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో సోమ, మంగళ వారాల్లో కంపెనీ షేరు 5.56 శాతం ర్యాలీ చేసింది. తద్వారా ఈ రెండు రోజుల్లోనే కంపెనీ రూ.44,541.28 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను సాధించింది. ఇక మంగళవారం మార్కెట్‌ ముగింపు సమయానికి రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.8.52లక్షల కోట్లుగా ఉంది.You may be interested

విప్రో ఏడీఆర్‌ 3.4 శాతం డౌన్‌

Wednesday 17th April 2019

  రూ. 10,000 కోట్ల విలువైన బైబ్యాక్‌ ప్రకటించినప్పటికీ, ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడంతో మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో విప్రో అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ ఏడీఆర్‌ 4.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల ఆదాయ వృద్ధి 7–8 శాతం మేర వుండగా, విప్రో ఆదాయం 4 శాతమే పెరగడం విశ్లేషకుల్ని నిరాశపర్చింది. రూ. 325 ధరతో

ఈ మూడు రంగాల కంపెనీలకే మంచి లాభాలు

Wednesday 17th April 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు రంగాల్లోని కంపెనీలు మంచి లాభాల్ని ఆర్జించే అవకాశం వుందని తాము అంచనావేస్తున్నట్లు కొటక్‌ మహింద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షిబాని సర్కార్‌ కురియన్‌ చెప్పారు. ఆమె ఒక అంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి కార్పొరేట్‌ లాభాల్లో పెద్దగా వృద్ధిలేదని, అయితే 2018-19 క్యూ4లో కొంతవరకూ ఎర్నింగ్స్‌ మూమెంటమ్‌ వుంటుందన్న అంచనాలు వున్నాయన్నారు. ఈ క్రమంలో 2019.20లో

Most from this category