టీసీఎస్ క్యూ2 ఫలితాలు భళా: షేరు డీలా..!
By Sakshi

దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి సంస్థ టీసీఎస్ షేరుకు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు రుచించలేదు. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆ షేరు 2.75శాతం నష్టపోయింది. కంపెనీ గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాలను ప్రకటించింది. ఆ క్యూ2తో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు టీసీఎస్ షేరు కొనుగోలుకు మొగ్గుచూపలేదు. ఫలితంగా బీఎస్ఈలో షేరు అరశాతం నష్టంతో రూ.1990.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.75శాతం వరకు నష్టపోయి రూ.1925.00ల వద్ద కనిష్టానికి తాకింది. ఉదయం గం. 9:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1979.75)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.1960.95ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1228.85 రూ.2273.00లుగా నమోదయ్యాయి.
You may be interested
బలపడిన రూపాయి..
Friday 12th October 2018ఇండియన్ రూపాయి శుక్రవారం లాభపడింది. ఆసియా కరెన్సీలు బలపడటం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.77 వద్ద ట్రేడవుతోంది. గురువారం ముగింపు 74.13తో పోలిస్తే 0.47 శాతం లాభపడింది. రూపాయి శుక్రవారం 73.80 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.986 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు 8.031 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ
గ్యాప్‌అప్‌తో ఆరంభం..
Friday 12th October 2018గురువారం కుదేలైన ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 34,001 పాయింట్లతో పోలిస్తే 290 పాయింట్ల లాభంతో 34,291 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,234 పాయింట్లతో పోలిస్తే 97 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్ వరుసగా ఆరో సెషన్లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన