STOCKS

News


టీసీఎస్‌ సీఈఓ వేతనం 28% పెంపు

Friday 17th May 2019
news_main1558076094.png-25794

  • రూ.16 కోట్లు దాటిన చెల్లింపులు

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ గోపీనాథన్‌ వేతనం 28 శాతం పెరిగింది. ఏడాది జీతం రూ.16 కోట్లు దాటింది. రాజేష్‌ గోపీనాథన్‌కు గతేడాదిలో ఈ మొత్తాన్ని వేతనంగా చెల్లించినట్లు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చెల్లింపుల వివరాల్లోకి వెళితే.. జీతం రూ.1.15 కోట్లు, అదనపు ప్రయోజనం రూ.1.26 కోట్లు, కమీషన్‌ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60 లక్షలు కలిపి మొత్తంగా 16.02 కోట్ల రూపాయిలు చెల్లించింది. 2017-18లో ఈయనకు చెల్లించిన మొత్తం రూ.12.49 కోట్లతో పోల్చితే గతేడాది వేతనం 28 శాతం పెరిగింది. ఇక సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం వేతనం రూ.11.61 కోట్లు (24.9 శాతం పెంపు), సీఎఫ్‌ఓ రామకృష్ణన్ వేతనం రూ.4.13 కోట్లుగా వెల్లడించింది. ఉద్యోగుల జీతాల్లో 2 నుంచి 5 శాతం పెంపు ఉన్నట్లు ప్రకటించింది.



You may be interested

ఒక్క త్రైమాసికంలో 52వేల కోట్లు!!

Friday 17th May 2019

 ఈ క్యూ4లో ప్రభుత్వ బ్యాంకుల కేటాయింపులివీ... లాభాలను పూర్తిగా హరిస్తున్న మొండి బాకీలు మరికొన్ని క్వార్టర్ల పాటు ఇదే వరుస: విశ్లేషకులు ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎన్‌పీఏలకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు

రూ.2 వేల కోట్లతో మాస్టర్‌ కార్డ్‌ సర్వీస్‌ హబ్‌

Friday 17th May 2019

పుణేలో ఏర్పాటు; అక్కడే డేటా సెంటర్‌ కూడా ఐదేళ్లలో రూ.7 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక మాస్టర్‌ కార్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్లోబల్‌ కార్డ్‌ పేమెంట్స్‌ కంపెనీ మాస్టర్‌ కార్డ్‌ వచ్చే ఐదేళ్లలో ఇండియాలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో పుణేలో సర్వీస్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇదే ప్రాంతంలో గతేడాది అక్టోబర్‌లో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు

Most from this category