STOCKS

News


టాటా మోటార్స్‌ అంతర్జాతీయ అమ్మకాలు 12% డౌన్‌

Wednesday 13th February 2019
Markets_main1550039066.png-24168

  • జనవరి సేల్స్‌ 1,00,572 యూనిట్లు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాల్లో గతనెల 12 శాతం తగ్గుదల నమోదైంది. లగ్జరీ కార్ల విభాగానికి చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలను కలుపుకుని సంస్థ మొత్తం కార్ల అమ్మకాలు జనవరిలో 1,00,572 యూనిట్లుగా నిలిచాయి. 2018 జనవరిలో అమ్ముడైన 1,14,797 యూనిట్లతో పోల్చితే 12 శాతం క్షీణత నమోదైనట్లు కంపెనీ వివరించింది. ఇక వాణిజ్య వాహనమైన టాటా దేవూ విక్రయాలు 9 శాతం తగ్గి 40,886 యూనిట్లుగా నమోదైయ్యాయి. ప్యాసింజర్‌ వాహనాల విషయానికి వస్తే.. 15 శాతం తగ్గుదలతో 59,686 యూనిట్లుగా నిలిచాయి. జనవరిలో జాగ్వార్‌ గ్లోబల్‌ సేల్స్‌ 12,904 యూనిట్లు, ల్యాండ్‌ రోవర్‌ 28,772 యూనిట్లు కాగా, రెండింటి విక్రయాలు కలిపి 41,676 యూనిట్లుగా నమోదైయ్యాయి.



You may be interested

హిందాల్కో లాభం 47 శాతం అప్‌

Wednesday 13th February 2019

రూ.713 కోట్లకు నికర లాభం  తగ్గిన వడ్డీ వ్యయాలు  8 శాతం పెరిగిన ఆదాయం  హిందాల్కో నికర లాభం ఈ డిసెంబర్‌ క్వార్టర్లో 47 శాతం(ఉత్కళ్‌ ప్లాంట్‌ను కలుపుకొని) వృద్ధితో రూ.713 కోట్లకు  పెరిగింది. గత క్యూ3లో రూ. 484 కోట్ల నికర లాభం వచ్చిందని హిందాల్కో తెలిపింది. నిర్వహణ ఆదాయం అధికంగా ఉండటం, వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండటంతో నికర లాభం పెరిగిందని వివరించింది.  ఆదాయం రూ,.11,028 కోట్ల నుంచి 8 శాతం

ఏంజల్‌ బ్రోకింగ్‌ స్ట్రాంగ్‌ బెట్స్‌

Wednesday 13th February 2019

దీర్ఘకాలంలో బలమైన రాబడులు(రిటర్న్‌ పొటెన్షియల్‌) అందించే సత్తా ఉన్న స్టాకులను ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. ఆయా స్టాకులు ఎంత శాతం అప్‌మూవ్‌ జరపగలవో అంచనాలు వేస్తోంది.  1. జేఎస్‌పీఎల్‌: 91 శాతం అప్‌సైడ్‌. గత ఐదేళ్లో ముడి స్టీల్‌ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న సామర్ధ్యంలో 50 శాతం వినియోగంలో ఉంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.  2. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: 86 శాతం అప్‌సైడ్‌. ఎస్‌ఓటీపీ వాల్యూషన్ల ప్రకారం

Most from this category