STOCKS

News


సన్‌ ఫార్మా లాభం నాలుగు రెట్లు

Wednesday 13th February 2019
news_main1550039595.png-24171

  • పుంజుకున్న అమెరికా జనరిక్స్‌ వ్యాపారం
  • రూ.7,740 కోట్లకు మొత్తం ఆదాయం 
  • ఆర్‌ అండ్‌ డీ పెట్టుబడులు అమ్మకాల్లో 6 శాతం 

న్యూఢిల్లీ: సన్‌ ఫార్మా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.322 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.1,242 కోట్లకు పెరిగిందని సన్‌ ఫార్మా తెలిపింది. శాతం పరంగా చూస్తే, 286 శాతం వృద్ధి సాధించింది. అమెరికా జనరిక్స్‌ వ్యాపారం పటిష్టమైన రికవరీని సాధించడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. రూ.513 కోట్ల పన్ను సర్దుబాట్లు కారణంగా గత క్యూ3లో నికర లాభం భారీగా తగ్గిందని సన్‌ ఫార్మా దిలిప్‌ సంఘ్వి పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుంటే ఈ క్యూ3లో నికర లాభం 49 శాతం పెరిగినట్లు అవుతుందని వివరించారు. ఆదాయం రూ.6,653 కోట్ల నుంచి రూ.7,740 కోట్లకు ఎగసిందని తెలిపారు. నికర లాభ మార్జిన్‌ 16.2 శాతంగా ఉందని వెల్లడించారు. ఎబిటా మార్జిన్‌ 27.8 శాతానికి చేరిందని తెలిపారు. 

భారత్‌లో అమ్మకాలు రూ.2,235 కోట్లు 
ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని కంపెనీ ఎమ్‌డీ, దిలిప్‌ సంఘ్వి సంతృప్తి వ్యక్తం చేశారు.  భారత్‌లో బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ అమ్మకాలు 7 శాతం పెరిగి రూ.2,235 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా 29 శాతమని వివరించారు. అమెరికాలో అమ్మకాలు 10 శాతం పెరిగి 36.2 కోట్ల డాలర్లకు వృద్ధి చెందాయని, మొత్తం అమ్మకాల్లో ఇది 34 శాతానికి సమానమని పేర్కొన్నారు. ఇతర మార్కెట్లలో అమ్మకాలు 7 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ టీ) పెట్టుబడుల కోసం రూ.465 కోట్లు కేటాయించామని, ఇది మొత్తం అమ్మకాల్లో 6.1 శాతానికి సమానమని పేర్కొన్నారు.



You may be interested

మార్చి దాకా పొడిగింపు..

Wednesday 13th February 2019

టీవీ చానెల్స్‌ను ఎంచుకునేందుకు గడువు పెంచిన ట్రాయ్‌ ఇంకా ఎంపిక చేసుకోని వారికోసం 'బెస్ట్ ఫిట్ ప్లాన్' అమలు న్యూఢిల్లీ: కొత్త బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్ సేవల విధానం కింద టీవీ వీక్షకులు తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మార్చి 31 దాకా పొడిగించింది. ఒకవేళ కస్టమర్లు నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంచుకోని పక్షంలో సముచితమైన ప్లాన్‌ను (బెస్ట్ ఫిట్ ప్లాన్‌) వారికి అందించాలని

రేపు భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌

Wednesday 13th February 2019

రేపు భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌ రూ. 3,500 కోట్ల సమీకరణ లక్ష్యం!  ఒక్క రోజుకే ఎఫ్‌పీఓ పరిమితం  భారత్‌-22 ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)రేపు(గురువారం) జరగనున్నది. ఒక్క రోజు మాత్రమే జరిగే ఈ ఎఫ్‌పీఓ ద్వారా కనీసం రూ.3,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి బిడ్‌లు వస్తే, వాటిని కూడా అట్టే పెట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా

Most from this category