STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 14th June 2019
Markets_main1560487228.png-26279

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
వోక్ హార్డ్‌:-
మ‌హారాష్ట్ర యూనిట్‌కు యూఎస్ఎఫ్‌డీఏ జీరో అబ్జర్వేష‌న్ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజీల‌కు స‌మాచారం ఇచ్చింది.  ఈ జూన్ 10-12 తేదిలో యూఎస్ఎఫ్‌డీఏ త‌నిఖీలు నిర్వహించిన‌ట్లు తెలిపింది. 
రిల‌య‌న్స్ హోమ్ ఫైనాన్స్:- పీడ‌బ్ల్యూసీ పరిశీలనలు పూర్తిగా నిరాధారమైనవి, అన్యాయమైనవి. ఆడిట్ క‌మిటితో ముందుగా ఎలాంటి చ‌ట్టబ‌ద్ధమైన చ‌ర్చలు జ‌ర‌ప‌లేద‌ని రిల‌య‌న్స్ హోమ్స్  అధికార ప్రతినిధులు వివ‌ర‌ణ‌నిచ్చారు. 
నాగార్జున ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్:- కంపెనీ నామినేట్ డైరెక్టర్ ప‌ద‌వికి స‌య్యద్ సాబుద్దీన్ రాజీనామా చేశారు. 
హిందాల్కో ఇండ‌స్ట్రీస్‌:- సెక్యూర్డ్ రీడ‌మబుల్ నాన్ క‌న్వర్టబుల్ డిబెంచ‌ర్లపై వ‌డ్డీ చెల్లింపున‌కు జూన్ 14ని రికార్డు తేదిగా నిర్ణయించింది. 
వీటో స్విచ్‌గేర్స్ అండ్ కేబుల్స్‌:- విదేశాల్లోని త‌న‌ అనుబంధ సంస్థ వీటో ఓవ‌ర్సీస్‌ కు 1 మిలియ‌న్ డాల‌ర్ల అన్‌సెక్యూర్డ్ రుణాన్ని విడుద‌ల చేసింది. 
 పీఐ ఇండ‌స్ట్రీస్:- క్రిసెట్ రేటింగ్ సంస్థ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఎఎ- పాజిటివ్ కు స‌వ‌రించింది. అలాగే కంపెనీ గల బ్యాంకు సౌక‌ర్యాలను దృష్ట్యా కంపెనీ  స్వల్పకాలిక రేటింగ్ ను ఎ1(+) కు పెంచింది.
హెక్సావేర్‌:- డిజిటల్‌ రంగంలో సేవలు అందించే మోబిక్విటీ సంస్థను 182 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 
ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- నేడు(జూన్‌ 14న) ఎన్‌సీడీలపై చెల్లించాల్సిన వడ్డీని సకాలంలోనే చెల్లిస్తామని తెలిపింది. 
కెనరా బ్యాంక్‌:- క్యూఐపీ ప్రక్రియకు మర్చెంట్‌ బ్యాంకర్లకు ఎంపిక చేసుకుంది. 
ఫెడరల్‌ బ్యాంక్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాం‍డ్ల జారీ ద్వారా రూ.500 కోట్ల సమీకరణ అంశంపై ఈ జూన్‌ 20న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. 
టెరెంటో:- జూన్‌ 18న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ అంశంపై చర్చించనుంది. 
గృహ్‌ ఫైనాన్స్‌:- నేడు హెచ్‌డీఎఫ్‌సీ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 4.2శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ.290గా నిర్ణయించింది. 



You may be interested

రూపీ 11పైసలు డౌన్‌

Friday 14th June 2019

 శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 69.61 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పై ప్రభావం చూపాయి.  రూపీ ఆరంభమే బలహీనంగా 69.55 వద్ద మొదలైంది. గురువారం రూపీ 69.50 వద్ద క్లోజయింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో రూపీ స్వల్ప శ్రేణిలో ట్రేడవుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ కరెన్సీలతో

ఫ్లాట్‌గా ప్రారంభమైన నిఫ్టీ

Friday 14th June 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 39,797.00 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,910.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై కోత అంచనాలతో పాటు, ఇంధన షేర్ల ర్యాలీ కారణంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక నేడు ఆసియాలో ఒక్క జపాన్‌ తప్ప మిగిలిన

Most from this category