STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 13th February 2019
Markets_main1550032315.png-24164

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:-
ధావన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌:-
కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌ పదవికి విజయ సంపత్‌ రాజీనామా చేశారు. 
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, అలహాదాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీ్‌స్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌:- నిధుల వినియోగంగలో విఫలమైన కారణంగా ఆర్‌బీఐ ఈ నాలుగు బ్యాంక్‌లపై రూ.1.50 కోట్ల జరిమానా విధించింది. 
అలెంబిక్‌ ఫార్మా:- హృదయ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఫెనోఫైబ్రేట్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
టాటా పవర్‌:- తన అనుబంధ సంస్థ చత్తీస్‌ఘడ్‌లో రూఫ్‌టాప్స్‌ సెల్యూషన్‌ను ఆవిష్కరించింది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ : సంస్థధాఖలు చేసిన దివాళా పిటిషన్‌ను వచ్చే 6కు వాయిదా వేసింది. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌: అమెరికా మార్కెట్లో ‘టడాలఫిల్‌’ ట్యాబ్లెట్‌' విక్రయించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనమతులు దక్కించుకుంది.
ఎల్‌ అండ్‌ టీ:- తన అనుబంధ సంస్థ ఎల్‌ అండ్‌ టీ హైడ్రోకార్బన్‌ సోనాట్రాచ్‌ నుంచి రూ.7000 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- 
భారత్‌ ఫోర్జ్స్‌, భాష్‌, ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌బీసీసీ(ఇండియా), ఓరాకిల్‌ ఫైన్‌ సర్వీసెస్‌; రిలయన్స్‌ క్యాపిటల్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్స్‌, అదానీ గ్యాస్‌, లెమన్‌ట్రీహోటల్స్‌, 8కె మైల్స్‌, ఫోర్స్‌ మోటర్స్‌, జీఎండీజీ లిమిటెడ్‌, గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌, గల్ఫ్‌ ఆయిల్‌, హిందూస్థాన్‌ కంపోజిషన్స్‌, కేఐఆర్‌ఐ ఇండస్ట్రీస్‌, మెక్‌నల్లీ భారత్‌ ఇంజనీరింగ్స్‌, ప్రభాత్‌ డైరీ, క్విక్‌ హీల్‌, రుచి సోయా, శ్రద్ధా మోటర్స్‌, సిటీ నెట్‌వర్క్స్‌, టీఎన్‌పీఎల్‌, గాయత్రీ హైవేస్‌, ముక్తా ఆర్ట్స్‌, ఆర్చిడ్‌ ఫార్మా, కిర్లోస్కర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ, ఇండో రమా సింథటిక్స్‌, హబ్‌ టౌన్‌, పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌.



You may be interested

మరోదఫా రేటు కోత చాన్స్‌...!

Wednesday 13th February 2019

సానుకూల ఆర్థిక గణాంకాలు 19 నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో కేవలం 2.05 శాతం మందగమనంలో పారిశ్రామికం డిసెంబర్‌లో కేవలం 2.4 శాతం వృద్ధి  న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో దఫా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం)కు తగిన ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో  కేవలం 2.05 శాతంగా నమోదయ్యింది. గడచిన 19 నెలల్లో ఇంత

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ అప్‌ 40 పాయింట్లు

Wednesday 13th February 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌126 పాయింట్ల పెరుగుదలతో 36,280 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 10870 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం​ రోజు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించిన సన్‌ఫార్మా 2.5 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 500 వద్ద మొదలై నిఫ్టీ-50లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ ఐటీసీ 2 శాతంపైగా పెరిగి

Most from this category