STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 12th July 2018
Markets_main1531371431.png-18237

ముం‍బై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
అశోకా బిల్డ్‌కాన్‌, జనరల్‌ ఇన్యూరెన్స్‌:- 2:1 నిష్పత్తిలో ఎక్స్‌-బోనస్‌ ప్రకటించాయి.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- నేడు జరిగే బోర్డు సమావేశంలో బై-బ్యాక్‌ అంశంపై చర్చించనుంది.
సిప్లా:- దక్షిణాఫ్రికాలోని తన అనుబంధ సంస్థ ద్వారా మిర్రేన్‌ సంస్థను రూ.228 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐడీఎఫ్‌సీ:- మధ్యంతర చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా రిన్‌కో సోమనీ నియమితులయ్యారు.
హెచ్‌ఐఎల్‌:- జర్మనిలోని తన అనుబంధ సంస్థలో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్లు స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
సన్‌ఫార్మా:- అమెరికాలోని తన అనుబంధ సం‍స్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌ జర్మనీకి  చెందిన బయోఫ్రంటెరా సంస్థపై చట్టపరమైన పరమైన చర్యలకు ఫిర్యాదు చేసింది.
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌:- జూలై 13న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ అంశంపై చర్చించనుంది.
శ్రీ సిమెంట్స్‌:- యూసీసీ సంస్థలో పూర్తి వాటాను కొనుగోలు చేసింది.
శ్రీ అజిత్‌ పేపర్స్‌:- ఎగుమతులకు సంబంధించి రూ.4.06 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
ఇండియా గ్లైకోస్‌:- ఆగస్ట్‌ 4న అసాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
ఎం అండ్‌ ఎం ఫోర్జింగ్‌:- 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఐడీబీఐ బ్యాంకు:- సవరించి ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
సియెంట్‌, కర్ణాటక బ్యాంకుYou may be interested

ఆనంద్‌ రాథీ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Thursday 12th July 2018

బలమైన వృద్ధి, నాణ్యమైన మేనేజ్‌మెంట్‌, తక్కువ రుణాలు, ఆకర్షణీయమైన వాల్యూషన్లు ఉన్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని ఆనంద్‌ రాథీ బ్రోకరేజ్‌ సలహా ఇస్తోంది. ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ కోసం మూడు మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చని రికమండ్‌ చేస్తోంది.  1. పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌: టార్గెట్‌ రూ. 960. ఈ ఆర్థిక సంవత్సరం మంచి రికవరీ చూపుతుందని అంచనా. గత రెండేళ్లుగా కంపెనీ డిజిటల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కలిసిరానుంది. ఈ సంవత్సరం సేల్స్‌,

19 పైసలు బలపడిన రూపాయి

Thursday 12th July 2018

10 గంటల సమయానికి 68.64 వద్ద ట్రేడింగ్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 19 పైసలు బలపడి 68.58 దగ్గర ప్రారంభమయ్యింది. దేశీయ స్టాక్‌ మార్కె‍ట్‌ రికార్డు స్థాయి లాభాల్లో ప్రారంభంకావడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగి రూపాయి విలువ బలపడిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయికి

Most from this category