STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 16th May 2019
Markets_main1557982411.png-25764

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.6వేల కోట్ల మూలధన నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం మూలధన సమీకరణలో రూ.4,900 కోట్లను ఈక్వీటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది.
లుపిన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ ప్లాంట్‌లో తనిఖీలు పూర్తి చేసింది. ప్లాంట్‌ నిర్వహణ లోపాల్ని గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ 3 అబ్జర్వేషన్లు జారీ చేసినట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
బాలాజీ అమీన్స్:- మహారాష్ట్రలోని చిన్చోలి యూనిట్లో కొత్త ఉత్పత్తుల తయారీకి మహారాష్ట్ర పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి అనుమతి దక్కించకుంది.
ఆల్కార్గో లాజిస్టిక్స్:- సెక్యూరిటీ, అన్‌సెక్యూరిటీ డిబెంచర్లు, లేదా బాండ్ల ఇష్యూ జారీ ద్వారా రూ.1000 కోట్ల రుణాన్ని సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
రామ్‌గోపాల్‌ పాలీటెక్స్‌:- ఈక్విటీ షేర్ల స్వచ్ఛంద డీలిస్టింగ్‌కు నేషనల్‌ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌కు నుంచి అనుమతులు పొందింది.
ఎస్‌కేఎఫ్‌ ఇండియా:- ప్రతి ఈక్విటీ షేరుకు రూ.12ల తుది డివిడెండ్‌ కేటాయింపునకు బోర్డు ఆమోదం తెలిపింది.
టాటా కెమికల్స్‌:- కన్జ్యూమర్‌ ప్రాడక్ట్స్‌ వ్యాపారాన్ని టాటా గ్లోబల్‌ బేవరీజెస్‌తో విలీనం చేసింది.
జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌:- రూ.1600 కోట్ల మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- రూ.6 కోట్ల విలువైన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూను జారీ చేసింది.

నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హిందాల్కో ఇండస్ట్రీస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అడ్లాబ్స్ ఎంటర్టైన్మెంట్, బజాజ్‌ ఫిన్‌సర్వీసెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌, బ్లూ డార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, డీడీ కార్పోరేషన్‌, జేకే టైర్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జుబిలెంట్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌, సోలారా యాక్టివ్‌ ఫార్మా, టేక్‌ సెల్యూషన్స్‌, వీసా స్టీల్‌, వాల్‌చందర్‌నగర్‌ ఇండస్ట్రీస్‌, యూనివర్సల్‌ కేబుల్‌, టేస్టీ బైట్‌ ఈటబుల్స్‌You may be interested

యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ డేగకన్ను!?

Thursday 16th May 2019

గాంధీ నియామకమే నిదర్శనం ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఆర్‌గాంధీని యస్‌బ్యాంక్‌ అదనపు డైరెక్టర్‌గా ఆర్‌బీఐ నియమించింది. ఈ నియమాకంతో యస్‌బ్యాంక్‌పై మరింత నిశిత పరిశీలన జరపాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ చేపట్టిన క్లీనప్‌ కార్యక్రమానికి అండగా ఉండేందుకు గాంధీని నియమించారని భావిస్తున్నారు. బ్యాంకుపై ఆర్‌బీఐకున్న అనుమానాలను ఈ నియామకం ధృవపరుస్తోందని విశ్లేషకులు అనుకుంటున్నారు. గాంధీ నియామకం అంతిమంగా ఇన్వెస్టర్లకు మేలు చేయకపోవచ్చని ఎక్కువమంది భయపడుతున్నారు. ఈ భయాలతోనే

11150పై ప్రారంభమైన నిఫ్టీ

Thursday 16th May 2019

ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభంతో మొదలైంది.  సెన్సెక్స్‌ 64 పాయింట్లు లాభపడి  37,179 వద్ద నిఫ్టీ 23 పాయింట్లను లాభంతో 11150పైన 11,180 వద్ద ప్రారంభమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసిస్తున్న తరణంలో కార్లు, ఆటో విడిభాగాల దిగుమతులపై సుంకాల విధింపును వాయిదా వేసే యోచనలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు అమెరికా

Most from this category