STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 9th November 2018
Markets_main1541735121.png-21800

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
గెయిల్‌ ఇండియా:- బురానీ - గౌహతీ పట్టణాల మధ్య 616 కిలోమీటర్ల గ్యాస్‌ లైన్‌ నిర్మాణానికి సంబంధించి రూ.1100 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.  
అలహబాద్‌ బ్యాంక్‌:- రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.3054 కోట్లను సమీకరించనుంది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- అక్టోబర్‌లో 14.47 టన్నుల ముడిస్టీల్‌ ఉత్పత్తిని చేసింది. గతేడాది ఇదే నెలలో ఉత్పత్తి అయిన 13.43 టన్నుల స్టీల్‌ ఉత్పత్తితో పోలిస్తే ఇది 8శాతం అధికం.
గ్లెన్‌మార్క్:- కాన్సర్‌ ప్రాథమిక దశలో చికిత్సలో వినియోగించే సీడీ38ఎక్స్‌సీడీ ఔషధాలను మార్కెట్లో ఆవిష్కరించింది.
హెచ్‌ఎంటీ:- వ్యక్తిగత కారణంతో కంపెనీ సీఎఫ్‌ఓ పదవికి హితేశ్‌ గోయిల్‌ రాజీనామా చేశారు.
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- కంపెనీ సీఈవో పదవికి భవ్‌దీఫ్‌ సింగ్‌ రాజీమానా చేశారు.
ఎంఫసిస్‌:- అమెరికా ఆధారిత కంపెనీ స్టెల్లిజెంట్‌ సిస్టమ్స్‌ను రూ.181 కోట్లకు కొనుగోలు చేసింది.
డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌:- డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 73.44శాతం వాటాను విక్రయించేందుకు క్యాబినేట్‌ ఆమోదముద్ర వేసింది.
ఎన్‌ఎండీసీ:- కర్ణాటక ప్రభుత్వం నుంచి దోనిమలై మైనింగ్‌ను 20ఏళ్లపాటు లీజింగ్‌కు తీసుకున్నట్లు తెలిపింది.
హీరో మోటోకార్ప్‌:- ఎక్స్‌ప్లస్‌ 200టీ పేరుతో మరో ద్విచక్రవాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఎంఆర్‌ఎఫ్‌:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మరో రెండేళ్ళ కాలానికి ఎంకే మన్నన్‌ పదవిని కొనసాగిస్తున్నట్లు ఉత్వర్తులు జారీ చేశారు.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
టైటాన్‌, శంకర్‌ బిల్డింగ్‌ ప్రోడెక్ట్స్‌, హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్చ్సేంజ్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌, నాగార్జున ఫెర్టిలైజర్స్‌, గాయత్రి హైవేస్‌, బీజీఆర్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, ఈద్‌ ప్యారీ ఇండియా, వీఎస్‌టీ టిల్లర్‌ ట్రాక్టర్స్‌, నాగార్జున ఆయిల్‌ రీఫైనరీ, అమరరాజా బ్యాటరీస్‌, హెచ్‌ఎంటీసీ, కాకతీయ సిమెంట్‌, ధరణి షుగర్స్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఫ్యాక్ట్‌, కేంబ్రిడ్జి టెక్నాలజీస్‌, శోభ.You may be interested

పీఈ మల్టీపుల్స్‌ చూడండి..!

Friday 9th November 2018

వచ్చే ఏడాదిలో బలమైన ఎర్నింగ్స్‌కు అవకాశం వాల్యుయేషన్స్‌ సమంజసం నాణ్యమైన యాజమాన్యం, ఆరోగ్యకర కార్పొరేట్‌ పాలన పలు రంగాలకు సానుకూలంగా మారనున్న ప్రస్తుత స్థూల అంశాలు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బీ గోప్‌కుమార్‌ సంవత్‌ 2075 అంచనాలు ఇవి ముంబై: పెట్టుబడులను పెంచడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశాన్ని ఇప్పుడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అందిస్తున్నాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బీ గోప్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 9th November 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.04 శాతం లేదా 10 పాయిం‍ట్ల లాభంతో 26,191 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.25 శాతం లేదా 7 పాయింట్ల నష్టంతో 2,806 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.53 శాతం లేదా 39

Most from this category