News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 17th May 2019
Markets_main1558068270.png-25786

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎల్‌ అండ్‌ టీ:-
మైండ్‌లో తన వాటాను 26శాతానికి పెంచుకుంది. 
ట్రిజెన్‌ టెక్నాలజీస్‌:- హాట్సన్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌కు ఐటీ ప్లేస్‌మెంట్‌ సేవలు అందించేందుకు కాంట్రాక్టు దక్కించుకుంది.
మణిప్పురం ఫైనాన్స్‌:- మణిప్పురం అస్సెట్‌ ఫైనాన్స్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- హోల్డింగ్స్ పీటీఈ, జనరల్ అట్లాంటిక్ గ్రూపునకు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయ ప్రక్రియను రద్దు చేసుకుంది.
యాక‌్షన్‌ కనస్ట్రక‌్షన్‌ ఎక్విప్‌మెంట్‌:- బోర్డు రూ.50 కోట్ల బై బ్యాక్‌ ఇష్యూకు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 9.9శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి ఈక్విటీ షేరు ధరను రూ.125లుగా నిర్ణయించింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- సియంట్‌లో వాటాను 5శాతం నుంచి 3శాతానికి పరిమితం చేసింది.
కేడీడీఎల్‌:- అనుబంధ సంస్థ ఈథోస్‌ హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.
మిండా ఇండస్ట్రీస్‌:- తన నాలుగు అనుబంధ సంస్థలను విలీనం చేసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

నేడు క్యూ 4 ఫలితాలను ప్రకటించే కొన్ని కంపెనీలు:-  బజాజ్‌ అటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఐఓసీ, అజ్మీరా రియల్టీ, అరవింద్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్‌, సీఈఎస్‌సీ, కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఇంజనీరింగ్స్‌ ఇండియా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌, శోభ, యూపీఎల్‌, జీ లెర్న్‌.



You may be interested

11300 పాయింట్ల పైనే బుల్స్‌కు పట్టు

Friday 17th May 2019

నిఫ్టీ మరింత అప్‌మూవ్‌ చూపాలంటే 11300 పాయింట్ల పైన బలంగా క్లోజవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఊగిసలాట అనంతరం బుల్స్‌ సూచీలపై పట్టు చూపారు. దీంతో సూచీలు ఆరంభ నష్టాలను అధిగమించాయి. నిఫ్టీ తన 100 రోజుల డీఎంఏ స్థాయి 11250 పాయింట్ల పైన స్థిరంగా క్లోజయింది. బుల్స్‌ ఇకపై పూర్తిగా పట్టుబిగించాలంటే 11300 పాయింట్ల పైన స్థిరపడాల్సిఉంటుంది. గురువారం చమురు గ్యాస్‌, రియల్టీ, పవర్‌ సూచీలు మంచి జోరు

సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో ప్రారంభం

Friday 17th May 2019

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ శుక్రవారం దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 37,494 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్ప లాభంతో  11,262 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప అన్ని రంగ షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆసియా మార్కెట్లల్లో వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో

Most from this category