STOCKS

News


మంగ‌ళ‌వారం వార్త‌ల్లోని షేర్లు

Tuesday 16th April 2019
Markets_main1555354321.png-25147

వివిధ వార్త‌ల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్ర‌భావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
జెట్ ఎయిర్‌వేస్‌:-
 ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కంపెనీకి మ‌ధ్యంత‌ర నిధుల జారీకి రుణదాత‌లు అంగీక‌రించే అవ‌కాశం లేదు.
ప్రెస్టేజ్ఎస్టేట్స్‌:-  త‌న అనుబంధ సంస్థ ద్వారా బాబిజీ రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మిగిలిన 51శాతం వాటాను రూ.316 కోట్ల‌కు కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌ల‌కు స‌మాచారం ఇచ్చింది. 
సిండికేట్ బ్యాంక్‌:- అన్ని ఎంసీఎల్ఆర్(మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు) రేట్ల‌పై 5 బేసిస్ పాయింట్ల‌ను త‌గ్గించింది. 
ల‌క్ష్మి విలాస్ బ్యాంక్‌:-  షేర్ల ఇష్యూ అంశంపై చ‌ర్చించేందుకు ఏప్రిల్ 22న జ‌రిగే బోర్డు స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. 
దీప‌క్ ఫెర్టిలైజ‌ర్స్‌:- గుజ‌రాత్‌లో ద‌హేజీ యూనిట్ వాణిజ్య ఉత్ప‌త్తుల‌ను ప్రారంభించింది. ఇందుకు కొర‌కు రూ. 550 కోట్ల ఖ‌ర్చుపెట్టింది. 
సెవెన్ లైఫ్ సైన్సెస్:-  అమెరికా అనబంధ సంస్థ సువెన్ న్యూరోసైన్సెస్ ఇంక్‌లో పెట్టుబ‌డుల ప‌ర‌మితిని పెంచింది. 
గ‌తంలో 25మిలియ‌న్ డాల‌ర్లను కేటాయించ‌గా ప్ర‌స్తుతం ఈ మొత్తాన్ని 50మిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచింది. ఇందుకు కంపెనీ బోర్డు సైతం ఆమోదం తెలిపింది. 
నేడు క్యూ4 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే కొన్ని ప్ర‌ధాన కంపెనీల వివ‌రాలు
విప్రో, మెస్టేక్‌, 5పైసా క్యాపిట‌ల్‌, డెన్ నెట్ వ‌ర్క్స్‌, అశుతోషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, నార్త‌న్ ప్రాజెక్ట్స్‌
నేటి లిస్టింగ్‌:- పాలీక్యాబ్ ఇండియాYou may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Tuesday 16th April 2019

ఆసియా సూచీలు స్వల్పహెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో మంగళవారం భారత్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 9.50 నిముషాలకు 40 పాయింట్ల లాభంతో 11,768 పాయింట్ల వద్ద కదులుతోంది. సోమవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,728 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా వుండగా, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగియగా, తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలు స్వల్పహెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

మీది లక్కీ పోర్ట్‌ఫోలియోనేనా?

Tuesday 16th April 2019

ఈక్విటీల్లో బంపర్‌ రాబడులు ఆశించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఈక్విటీ మార్కెట్లో పదేళ్ల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసే వారు తప్పకుండా సంపద కూడబెట్టగలరని చరిత్ర చెబుతోంది. కాకపోతే ప్రతీ ఏటా రాబడులు ఒకే విధంగా ఉండవు. అలాగే, సంపద సృష్టి అనేది మీరు ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశించారన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే, మార్కెట్‌ టైమింగ్‌ కంటే మార్కెట్లో ఎంత కాలం పాటు ఉన్నారన్నది కూడా కీలకం

Most from this category