STOCKS

News


భారత స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయండి

Saturday 8th December 2018
news_main1544240325.png-22746

గోవా: ఇన్‌ఫ్రా, వ్యవసాయం, వైద్యం తదితర రంగాలకు చెందిన దేశీ స్టార్టప్‌ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ అంతర్జాతీయ ఫండ్స్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు పిలుపునిచ్చారు. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల స్థాయికి చేరనున్న నేపథ్యంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ జరిగిన గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. రహదారులు, విమానాశ్రయాలు, పోర్టులు మొదలైన వాటితో కూడుకున్న మౌలిక సదుపాయాల రంగం రాబోయే రోజుల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని చెప్పారాయన. దాదాపు 65 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారత్‌ 100 పైగా విమానాశ్రయాల నిర్మాణం తలపెట్టిందని ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, తలసరి ఆదాయం పెరుగుతుండటం, పెట్టుబడులపై అధిక రాబడులు, భారీ మార్కెట్ మొదలైనవి భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సానుకూల అంశాలన్నారు. వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా జిల్లాల స్థాయిలో కూడా ర్యాంకింగ్‌లను అమల్లోకి తేనున్నట్లు సదస్సులో పాల్గొన్న సందర్భంమగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేష్ అభిషేక్ చెప్పారు. స్టార్టప్స్‌కి తోడ్పాటునిచ్చేందుకు ఇప్పటిదాకా 21 నిబంధనలను సరళతరం చేశామని, మరిన్ని చర్యలు తీసుకోబోతున్నామని ఆయన తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో ఇప్పటిదాకా స్టార్టప్స్‌కి సంబంధించి 41 పేటెంట్లు జారీ చేసినట్లు వివరించారు.



You may be interested

ఎల్‌ అండ్‌ టీకి రూ.2,547 కోట్ల ఆర్డర్లు

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రోకి (ఎల్‌ అండ్‌ టీ) చెందిన విభాగం రూ.2,547 కోట్ల ఆర్డర్లను సాధించింది. తమ విద్యుత్‌ ప్రసార, పంపిణీ విభాగం ఈ ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. టాంజానియాలో దారుస్సలామ్‌- మోరొగొరొల మధ్య 220 కిలో వాట్ల ట్రాన్సిమిషన్‌ లైన్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ను సాధించామని వెల్లడించింది. ఉత్తర ఆఫ్రికాలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన రెండు ఆర్డర్లను కూడా ఈ విభాగం పొందిందని పేర్కొంది.

నవంబర్‌లో జేఎల్‌ఆర్‌ విక్రయాలు 8% డౌన్‌

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జేఎల్‌ఆర్‌ కార్ల విక్రయాలు నవంబర్‌లో 8 శాతం తగ్గిపోయాయి. 48,160 కార్లను సంస్థ విక్రయించింది. చైనా, ఇతర ప్రధాన మార్కెట్లలో అమ్మకాల పరంగా ఉన్న సవాళ్లు ప్రభావం చూపించినట్టు కంపెనీ తెలిపింది. జాగ్వార్‌ బ్రాండ్‌ రిటైల్‌ అమ్మకాలు 8.9 శాతం పెరిగి 14,909 యూనిట్లుగా ఉన్నాయి. ల్యాండ్‌రోవర్‌ బ్రాండ్‌ కార్ల అమ్మకాలు 33,251 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14 శాతం

Most from this category