STOCKS

News


భవనం ఎత్తు పెరిగితే?

Saturday 10th November 2018
personal-finance_main1541829752.png-21857

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో జనాభా పెరుగుతుండటంతో ఐదంతస్తుల భవనాలు సర్వసాధారణమయ్యాయి. పాత భవనాలను కూల్చేసి మరీ కొత్త అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్న బిల్డర్లున్నారు. వీటికి తోడు 20, 34 అంతస్తుల ఆకాశహర్మ్యాలు సైతం నగరంలో దర్శనమిస్తున్నాయి. వీటిల్లో ఐదంతస్తుల వరకు చ.అ.కు ఒక రకమైన ధర ఉంటే ఆ తర్వాత ప్రతి అంతస్తుకు ధర పెరుగుతుంటుంది. నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి చ.అ. ధరల్లోనూ మార్పులుంటాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.
బాల్కనీ నుంచే చూస్తే ధర పెరుగుతుంది..
ఫ్లాట్‌లోని బాల్కనీ నుంచి బయటకు చూసినప్పుడు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటే మనసు తేలిక పడుతుంది. అటువంటి అవకాశం ఉంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. ఇక్కడే డెవలపర్లు చ.అ.కు ప్రాథమిక ధర కంటే అదనంగా తీసుకుంటున్నారు. నిర్మిస్తున్న భవంతుల్లో ఫ్లాట్‌ తూర్పు వైపున ఉంటే అదనంగా చెల్లించాల్సిందే. మన ఫ్లాట్‌లోంచి బయటకు చూస్తే ఉద్యానవనం కన్పించినా.. చెరువు కన్పించినా చ.అ.కు ధర మారుతుంటుంది. గతంలో ముందు బుక్‌ చేసిన వారికి ఇటువంటి సౌలభ్యం ఉచితంగానే ఎంచుకునే అవకాశం బిల్డర్లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ప్రతిదానికి ధర వసూలు చేయడంపై కొనుగోలుదారుల పెదవి విరుస్తున్నారు. 
నగరంలో నిర్మితమవుతున్న చాలా వరకు ఆకాశహర్మ్యాలు సిటీలోని పార్క్‌లు, ఆటవీ ప్రాంతం, చెరువుల సమీపంలో ఉన్నాయి. ఇక్కడ తమ ఇంట్లోని బాల్కనీ, కిటికీలోంచి ఈ సుందర దృశ్యాలను చూడాలంటే ప్రీమియం చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. కొందరు బిల్డర్లయితే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. శివారుల్లో నిర్మిస్తున్న విల్లాల్లోనూ ఇటువంటి అదనపు ధరను వసూలు చేస్తుండటం గమనార్హం. గోల్ఫ్‌ కోర్ట్‌ ఎదురుగా విల్లా కావాలంటే ప్రాథమిక ధర కంటే ఎక్కువ సమర్పించుకోవాల్సిందే.You may be interested

హైదరాబాద్‌ నం:1

Saturday 10th November 2018

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రూ.11,212 కోట్ల ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. 2018 మూడు త్రైమాసికంలో కలిపి మొత్తం రూ.37,815 కోట్ల పీఈ నిధులొచ్చాయని.. ఏటా 9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలిపింది. గత 11 ఏళ్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలోనే అత్యధిక పీఈ నిధులొచ్చాయి. ♦ ఈ ఏడాది క్యూ3లో

1500 శాఖలు మూతపడ్డాయ్‌!

Saturday 10th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అటు కస్టమర్లు, ఇటు బ్యాంకు ఉద్యోగులకు చేటు చేస్తుందని ఆల్‌ఇండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ జీ. సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలతో కస్టమర్లకు అందించే సేవలపై, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాలపై పెను ప్రభావం పడుతుందన్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడంతో దేశవ్యాప్తంగా దాదాపు 1500 శాఖలు

Most from this category