STOCKS

News


అమెరికన్ సంస్థలతో స్పైస్‌జెట్ జట్టు

Friday 13th July 2018
news_main1531503153.png-18299

 వాషింగ్టన్:  కార్యకలాపాల విస్తరణలో భాగంగా రెండు అమెరికన్ సంస్థలతో భారీ వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ఆయా కంపెనీల పేర్లు వెల్లడించనప్పటికీ.. ఇందులో ఒకటి పెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ కాగా, మరొకటి దిగ్గజ అమెరికన్ సంస్థని పేర్కొన్నారు. ఏవియేషన్ వ్యాపారం అధిక రిస్కుతో కూడుకున్నది కావడంతో ఇతరత్రా అనుబంధ వ్యాపార విభాగాలవైపు కూడా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, కార్గో, కొరియర్, లాజిస్టిక్స్ మొదలైన వ్యాపార విభాగాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు అజయ్ సింగ్ చెప్పారు. కార్గో.. కొరియర్ వ్యాపారానికి సంబంధించి అమెరికన్ కంపెనీలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.



You may be interested

అక్టోబర్‌ నుంచి డీబీఎస్‌ బ్యాంక్‌ సేవలు!!

Friday 13th July 2018

సింగపూర్‌: సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీబీఎస్‌ గ్రూప్‌.. భారత్‌లో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించడానికి సిద్ధమౌతోంది. తమకు పూర్తి అనుబంధ సంస్థగా ‘డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా’ను (డీబీఎస్‌ ఇండియా) ఏర్పాటు చేయడానికి త్వరలో తుది ఆమోదం రానుందని, దీని ద్వారా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పీయుష్‌ గుప్తా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన డీబీఎస్‌ ఆసియా 2018 సదస్సులో మాట్లాడారు.

మారుతీ కార్లలో లిథియమ్‌ బ్యాటరీలు!!

Friday 13th July 2018

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ కంపెనీ తన వాహనాల్లో లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీలను అమర్చాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా తన భారత్‌ విభాగమైన మారుతీ సుజుకీ ఇండియా విక్రయించే ప్రీమియం కార్లలో వీటిని అమర్చాలని చూస్తోంది. హ్యాచ్‌బ్యాక్‌ కారు స్విఫ్ట్‌, దీని కన్నా ఖరీదైన మోడళ్లలో సాం‍ప్రదాయిక లెడ్‌ బ్యాటరీల స్థానంలో దీర్ఘకాలం పనిచేసే లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీలను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీల వల్ల వ్యయం తగ్గుతుందని

Most from this category