STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీ క్యూ3 ఫలితాలు

Wednesday 13th February 2019
news_main1550040881.png-24174

  • నాట్కో మధ్యంతర డివిడెండు రూ.3.50

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా 2018-19 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండుగా రూ.3.50 చెల్లించనుంది. ఈ నిర్ణయాన్ని బోర్డు మంగళవారం ఆమోదించింది. డిసెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26.7 శాతం తగ్గి రూ.159 కోట్లుగా నమోదయింది. యూఎస్‌ఏ మార్కెట్లో ఓసెల్టామివిర్‌ మార్జిన్‌ తగ్గడం వల్లే లాభం కుంచించుకుపోయిందని కంపెనీ తెలిపింది. టర్నోవరు రూ.573 కోట్ల నుంచి రూ.580 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.1,738 కోట్ల టర్నోవరుపై రూ.522 కోట్ల నికరలాభాన్ని సాధించింది. 

  • 11 శాతం తగ్గిన పెన్నార్‌ లాభం

డిసెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ నికరలాభం ‍క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం తగ్గి రూ.15.3 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.417 కోట్ల నుంచి రూ.575 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.1,569 కోట్ల టర్నోవర్‌పై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది.

  • 11 శాతం తగ్గిన పెన్నార్‌ లాభం

డిసెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ నికరలాభం ‍క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం తగ్గి రూ.15.3 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.417 కోట్ల నుంచి రూ.575 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.1,569 కోట్ల టర్నోవర్‌పై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది.

  • మధుకాన్‌ ప్రాజెక్ట్స్ నష్టం రూ.4 కోట్లు

గడిచిన త్రైమాసికంలో మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ రూ.4 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.4 కోట్ల లాభం నమోదు చేసింది. టర్నోవరు రూ.117 కోట్ల నుంచి రూ.178 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.493 కోట్ల టర్నోవరుపై రూ.13 కోట్ల నష్టం నమోదైంది. 

  • ఎన్‌సీసీ లాభం 65 శాతం జూమ్‌

డిసెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో ఎన్‌సీసీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 65 శాతం పెరిగి రూ.150 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.2,093 కోట్ల నుంచి రూ.3,415 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌- డిసెంబరు కాలంలో రూ.9,208 కోట్ల టర్నోవరుపై కంపెనీ రూ.388 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 

  • ఒలెక్ట్రా నష్టం రూ.4 కోట్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (మునుపటి గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) డిసెంబరు క్వార్టరులో రూ.4 కోట్ల నష్టం నమోదు చేసింది. కిందటేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.66 లక్షల నికర లాభాన్ని ప్రకటించింది. టర్నోవరు రూ.52 కోట్ల నుంచి రూ.96 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 9 నెలల కాలానికి సంస్థ రూ.201 కోట్ల టర్నోవరుపై రూ.14 కోట్ల నికర నష్టం చవిచూసింది. 



You may be interested

15 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఖాయం!

Wednesday 13th February 2019

రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల పాటు దేశీయ ఈక్విటీలు రెండంకెల ఎర్నింగ్స్‌ వృద్ది నమోదు చేస్తాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. పన్నులు, మొండిపద్దులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విధాన నిర్ణయాల ఫలితంగా ఎకానమీలోకి నగదు ప్రవాహం పెరుగుతుందని అభిప్రాయపడింది. మొండిపద్దుల వసూళ్లు, జీఎస్‌టీ కారణంగా కంపెనీలకు మూలధన వ్యయాలు దిగివస్తాయని, ప్రజల్లో పొదుపు పెరుగుతుందని, దీంతో ఎర్నింగ్స్‌ 10- 15 శాతం వరకు

కార్పోరేట్‌ బ్రీఫ్‌

Wednesday 13th February 2019

లోక్‌సభ ముందుకు పోంజీ స్కీముల నిషేధం బిల్లు న్యూఢిల్లీ: సామాన్య ఇన్వెస్టర్లు బోగస్ పొదుపు పథకాలతో (పోంజీ స్కీములు) మోసపోకుండా చూసేందుకు ఉద్దేశించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ ప్రవేశపెట్టారు. అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం బిల్లుపై లోక్‌సభ బుధవారం చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. బడ్జెట్‌ చివరి రోజు కావడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి పూర్తి సమయాన్ని దీనికే కేటాయించాలని, దీంతో

Most from this category