STOCKS

News


సెల్‌ఫోన్‌ దిగుమతుల నిబంధనల్లో సడలింపు

Saturday 15th September 2018
news_main1536987505.png-20274

న్యూఢిల్లీ: మొబైల్‌ హాండ్‌సెట్స్‌ దిగుమతులు మరింత పెరిగే దిశగా టెలికం మంత్రిత్వ శాఖ‌ (డీఓటీ) నిర్ణయం తీసుకుంది. వైఫై, బ్లూటూత్‌ ఫీచర్లు కలిగిన సెల్‌ఫోన్‌ దిగుమతులకు సంబంధించి కీలక ప్రకటనచేసింది. ఇక నుంచి ఈ తరహా మొబైల్‌ ఫోన్ల దిగుమతికి తమ నుంచి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని డీఓటీ మెమొరాండం జారీచేసింది. వైఫై, బ్లూటూత్‌ కలిగిన ఫోన్లు విదేశీ వాణిజ్య విధానం పరిధిలో ఉన్నట్లు వివరించింది. తాజా మెమొరాండం ప్రకారం అధునాతన సెల్‌ఫోన్‌ దిగుమతులకు డబ్ల్యూపీసీ ఇంపోర్ట్‌ లైసెన్స్‌ అవసరం లేదని స్పష్టమవుతోందని ఇండియా సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) తెలిపింది. అయితే.. రేడియో బ్రాడ్‌కాస్ట్‌ ట్రాన్స్‌మిటర్లు, టీవీ బ్రాడ్‌కాస్ట్‌ ట్రాన్స్‌మిటర్లు, కమ్యూనికేషన్ జామింగ్ పరికరాలకు మాత్రం లైసెన్స్‌ తీసుకోవల్సి ఉంటుందని స్పష్టంచేసింది.



You may be interested

ఐఫోన్ 10ఎస్ @ రూ. 1.45 లక్షలు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్ కొత్తగా ఐఫోన్‌ సిరీస్‌లో ప్రవేశపెట్టిన 10ఎస్‌ హ్యాండ్‌సెట్స్‌ ప్రారంభ ధర భారత్‌లో రూ.1 లక్ష పైగానే ఉండనుంది. భారత్‌లో ఐఫోన్ 10ఎస్‌ ధర రూ. 99,000 నుంచి (64 జీబీ వేరియంట్) ఉంటుంది. 256 జీబీ వేరియంట్ రేటు రూ.1,14,900 గాను 512 జీబీ రేటు రూ.1,34,900గాను ఉంటుంది. ఇక 6.5 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో లభించే 10ఎస్ మ్యాక్స్ రేటు రూ.1,09,900 (64

అమ్మ కోరిక... పిటిషన్‌ ఉపసంహరణ

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్‌... తన అన్న మల్వీందర్‌ మోహన్‌ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. రెలిగేర్‌ మాజీ అధినేత సునీల్‌ గో‍ధ్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తమ మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కోరారని, వారి కోరిక మేరకు ఈ పిటీషన్లను

Most from this category