STOCKS

News


ఈ స్టాకులు మార్కెట్‌ కదలికలకు అతీతం!

Friday 17th May 2019
Markets_main1558080254.png-25798

మార్కెట్లో వస్తున్న తీవ్ర ఆటుపోట్లకు అతీతంగా ముందుకే దూసుకుపోతున్న కొన్ని స్టాకులను అనలిస్టులు గుర్తించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతినెలా ఈ స్టాకులు అప్‌మూవ్‌నే చూపుతున్నాయి. ఇలా మార్కెట్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా ర్యాలీ జరుపుతున్న చిన్న స్టాకుల్లో ఎస్‌ఆర్‌ఎఫ్‌, డీసీబీ బ్యాంక్‌, ఇండో రమా సింథటిక్స్‌, లీడింగ్‌ లీజింగ్‌ ఫైనాన్స్‌, ఎస్సార్‌, సహయోగ్‌ మల్టిబేస్‌, జంప్‌నెట్‌వర్క్‌, ప్రభాత్‌ టెక్నాలజీస్‌, కావిట్‌ ఇండస్ట్రీస్‌, ఫ్రెడన్‌ ఫార్మా, ఆర్‌ఏసీఎల్‌ గేర్‌టెక్‌, రిఫెక్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. ఈ స్టాకులన్నీల నెలవారీ లెక్కన ఈ ఏడాది ఆరంభం నుంచి లాభాలను అందిస్తున్నాయి. ఒకపక్క మార్కెట్లు ట్రేడ్‌ వార్‌ భయాలు, ఎన్నికల టెన్షన్లతో కిందామీదా పడుతున్నా, ఇవి మాత్రం స్థిర ప్రదర్శన చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొన్ని షేర్లపై విశ్లేషణ...
- ఎస్‌ఆర్‌ఎఫ్‌: వార్షిక టర్నోవర్‌ రూ. 5600 కోట్లు. దేశంలో 12, విదేశాల్లో రెండు ప్లాంట్లున్నాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 16వేల కోట్లు. జనవరి నుంచి ప్రతినెల దాదాపు 0.5- 15 శాతం ర్యాలీ జరుపుతోంది. షేరులో మరో 10 శాతం అప్‌సైడ్‌ ఉంటుందని షేర్‌ఖాన్‌ అంచనా.
- డీసీబీ బ్యాంక్‌: వచ్చే మూడునాలుగేళ్లలో బాలెన్స్‌ షీటు డబుల్‌ చేయాలని లక్ష్యిస్తోంది. ఎస్‌ఎంఈ, రిటైల్‌, అగ్రిలోన్లను ఏటా 20 శాతం పెంచుకుంటూ పోతే ఈ లక్ష్యం సాధించగలమని బ్యాంకు విశ్వసిస్తోంది. ప్రస్తుతం బ్యాంకు బాలెన్స్‌ షీటు విలువ దాదాపు 36 వేల కోట్ల రూపాయలు.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఈ ఏడాది ప్రధాన సూచీలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయి. కానీ ఈ డజను స్టాకులు మాత్రం ముందుకే సాగుతున్నాయి. మార్కెట్లు స్థిరపడిన తర్వాత చిన్నస్టాకుల్లో మంచి రికవరీ ఉంటుందని, అప్పుడీ డజను స్టాకులు మరింత దూకుడు చూపవచ్చని మాక్స్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ అంచనా వేస్తోంది. 

డాషింగ్‌ డజన్‌ స్టాకులివే...



You may be interested

అరబిందో ఫార్మా 8.50శాతం డౌన్‌

Friday 17th May 2019

దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ అరబిందో ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 8.50శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్‌- 1, యూనిట్‌ X1, యూనిట్‌ 1X తనిఖీలను పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఆయా యూనిట్లకు ఓఏఐ (అఫిషియల్‌ యాక్షన్‌ ఇండికేటెడ్‌) లేఖను జారీ చేసినట్లు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపిన అభ్యంతరాలకు వివరణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఓఏఐ కారణంగా ఈ ప్లాంట్లకు సంబంధించి

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 17th May 2019

పెన్నార్‌  విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెన్నార్‌ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌(పెబ్స్‌), పెన్నార్‌ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్‌ ప్రకారం, ప్రతి 13 పెబ్స్‌ షేర్లకు 23 పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్‌ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు

Most from this category