STOCKS

News


'ర్యాన్‌బాక్సీ' సింగ్ బ్రదర్స్ బాహాబాహీ!!

Saturday 8th December 2018
news_main1544240125.png-22743

న్యూఢిల్లీ: ఒకప్పటి ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. తాజాగా తమ్ముడు శివీందర్ సింగ్ తనపై దాడి చేశారంటూ అన్న మల్వీందర్ సింగ్ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. డిసెంబర్ 5న శివీందర్ సింగ్ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణలను శివీందర్ ఖండించారు. గ్రూప్‌ కంపెనీ ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులను మల్వీందర్‌ సింగ్ వర్గం బెదిరిస్తోందన్న సమాచారంతో తాను అక్కడికి వెళ్లినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారాయన. ఇదే క్రమంలో మల్వీందర్ సింగ్ తనను బలవంతంగా గోడకు అదిమిపెట్టేయడంతో తప్పించుకునే క్రమంలో ఆయన్ను పక్కకు తోసేసేందుకు మాత్రమే ప్రయత్నించానని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత మల్వీందర్‌తో కలిసి పనిచేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు బయటపడినప్పట్నుంచి సింగ్ సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మల్వీందర్ సింగ్ ఫోర్జరీ, అవకతవలకు పాల్పడ్డారని శివీందర్ సింగ్ ఆరోపిస్తున్నారు. 



You may be interested

జనవరి నుంచి ఫోక్స్‌వ్యాగన్‌ కార్ల ధరల పెంపు

Saturday 8th December 2018

ముంబై: ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, తయారీ వ్యయాలు పెరిగిపోవడమే ధరలు పెంచడానికి కారణమని పేర్కొంది. ఈ కారణాల వల్ల తప్పనిసరై ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్యాసింజర్‌ కార్ల విభాగం డైరెక్టర్‌ స్టీఫెన్‌న్యాప్‌ తెలిపారు. మారుతి సుజుకి, టయోటా, ఇసుజు మోటార్స్‌ ఇప్పటికే ధరలను పెంచాయి. 

జైట్లీపై ‘పిల్‌’ను కొట్టేసిన సుప్రీం

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూలధన నిల్వలకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై దాఖలయిన ఒక​ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన ఎం.ఎల్‌.శర్మ అనే న్యాయవాదికి రూ.50,000 కాస్ట్‌ను కూడా సుప్రీం విధించడం గమనార్హం. ఈ మొత్తం డిపాజిట్‌ చేసే వరకూ శర్మ ఎటువంటి పిల్‌ దాఖలు చేయలేరని, అందుకు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీని బెంచ్‌ ఆదేశించింది.

Most from this category