STOCKS

News


శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

Tuesday 16th April 2019
Markets_main1555394320.png-25160

ఇష్యూ సైజు రూ.1,250 కోట్లు 

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పచ్చజెండా ఊపింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,250 కోట్లు సమీకరిస్తుందని అంచనాలున్నాయి. ఈ విలువ పరంగా చూస్తే, ఈ కంపెనీ విలువ రూ.3,750 కోట్లని అంచనా. ఐపీఓ పత్రాలను గత ఏడాది డిసెంబర్‌లో సమర్పించిన ఈ కంపెనీ ఈ నెల 9న సెబీ నుంచి ఆమోదం పొందింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో భాగంగా ప్రస్తుత వాటాదారులు (టాటా క్యాపిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, టీపీజీ ఏషియా) 4.24 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మరోవైపు ప్రి-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.100 కోట్లు సమీకరించాలని కూడా కంపెనీ భావిస్తోంది.  ఈ ఐపీఓ నిధులను రుణాలను తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని  కంపెనీ యోచిస్తోంది.
ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తాయి. శ్రీరామ్‌ గ్రూప్‌నకు చెందిన శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ కంపెనీ దక్షిణ భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్టీ కంపెనీ. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌, విశాఖపట్నం నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మిడ్‌-మార్కెట్‌, అందుబాటు ధరల గృహ కేటగిరీలపై ఈ కంపెనీ ప్రధానంగా దృష్టిసారిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ 12 కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది.



You may be interested

‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్‌ రికార్డు

Tuesday 16th April 2019

40 రోజుల్లో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. తన ‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రికార్డు సృష్టించినట్లు సోమవారం ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 20 లక్షల యూనిట్ల విక్రయాలు పూర్తిచేయగా.. వీటి విలువ దాదాపు రూ.3,500 కోట్లని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజివిజిత్ సింగ్ వెల్లడించారు. చిన్న నగరాలు, మెట్రోల నుంచి ఏ50, ఏ30,

టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ ఆదాయం రూ.1,197 కోట్లు

Tuesday 16th April 2019

5 శాతం పతనమైన షేర్‌ న్యూఢిల్లీ:- మీడియా కంపెనీ, టీవీ-18 బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్‌​ 18 మీడియా, ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు

Most from this category