News


త్వరలో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ఐపీఓ

Wednesday 17th April 2019
Markets_main1555480717.png-25179

  •  ఇష్యూ సైజు రూ.4,500 కోట్లు 

న్యూఢిల్లీ: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ సోలార్‌, ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సమర్పించింది. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రమోట్‌​ చేస్తున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సంస్థ ఈ ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ చైర్మన్‌ ఖుర్షీద్‌ యజ్డి దారువాలా, పాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీలు తమ వాటాలో కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. 
ఆర్డర్‌ బుక్‌ రూ.4,309 కోట్లు 
ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ సెక్యూరిటీస్‌  వ్యవహరిస్తున్నాయి. బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గానే కాకుండా గ్లోబల్‌ కోఆర్డినేటర్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌(ఇండియా), డాషే ఈక్విటీస్‌ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ మొత్తం 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఏడాది చివరి నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.4,309 కోట్లుగా ఉంది.



You may be interested

రిలయన్స్‌ రిఫైనింగ్‌లో రూ.లక్ష కోట్ల వాటా విక్రయం?

Wednesday 17th April 2019

25 శాతం వాటా కొనుగోలుకు సౌదీ అరామ్‌కో చర్చలు మార్కెట్‌క్యాప్‌లో దేశంలో నంబర్‌వన్‌ కంపెనీ, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికాం వ్యాపారాల దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను  కొనుగోలు చేసేందుకు ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడతున్నాయి. ఈ వ్యాపారంలో 25 శాతం మైనారిటీ వాటా విక్రయం ద్వారా 10 నుంచి 15

పాలీక్యాబ్‌ లిస్టింగ్‌ మెరుపులు

Wednesday 17th April 2019

-18 శాతం లాభంతో లిస్టింగ్‌  -22 శాతం లాభంతో ముగింపు న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లు తయారు చేసే పాలీక్యాబ్‌ ఇండియా కంపెనీ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. బీఎస్‌ఈలో పాలీక్యాబ్‌ ఇండియా షేర్‌ ఇష్యూ ధర, రూ.538తో పోల్చితే 18 శాతం లాభంతో రూ.633 వద్ద లిస్ట్‌ అయింది. ఇంట్రాడేలో 23 శాతం లాభంతో రూ.668ను వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 22 శాతం లాభంతో రూ.655 వద్ద ముగిసింది.

Most from this category