ఎస్‌జీఎక్స్ నిఫ్టీ అప్
By Sakshi

ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 59 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ గురువారం ముగింపు స్థాయి 10,626 పాయింట్లతో పోలిస్తే 57 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా గురువారం మిశ్రమంగా ముగిశాయి. మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. భారీ పతనం.. ఆపై రికవరీ
అమెరికా మార్కెట్ల రికవరీ నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 12 పాయింట్ల లాభంతో 3,127 పాయింట్ల వద్ద, తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 70 పాయింట్ల లాభంతో 9,754 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్ షాంఘై కంపొసిట్ 5 పాయింట్ల నష్టంతో 2,600 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 1 పాయింటు నష్టంతో 2,067 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 17 పాయింట్ల లాభంతో 26,173 పాయింట్ల వద్ద, జపాన్ నికాయ్ 225.. 22 పాయింట్ల లాభంతో 21,524 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అయితే చివరకు రికవరీ అయ్యాయి. ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 0.32 శాతం లేదా 79 పాయింట్ల నష్టంతో 24,947 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 500.. 0.15 శాతం లేదా 4 పాయింట్ల నష్టంతో 2,695 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 0.42 శాతం లేదా 30 పాయింట్ల లాభంతో 7,188 పాయింట్ల వద్ద ముగిసింది. చైనాకు చెందిన టెలికం దిగ్గజ కంపెనీ హువావే ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ నేపథ్యంలో అంతంత మాత్రంగానే ఉన్న అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై మళ్లీ తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందని ఆందోళనలు ఇన్వెస్టర్లలో ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్ భారీగా పతనమైంది. అయితే చివరకు ఇండెక్స్‌లు కోలుకున్నాయి. దాదాపుగా నష్టాలను పూడ్చుకున్నాయి.
You may be interested
మార్కెట్ తగ్గుతుందా? పెరుగుతుందా?
Friday 7th December 2018శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 59 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ♦క్రూడ్ ధరలు శుక్రవారం నిలకడగానే ఉన్నాయి. అమెరికా క్రూడ్ నిల్వలు తగ్గడం ఇందుకు కారణం. అయితే సెంటిమెంట్ మాత్రం బలహీనంగానే ఉంది. ఒపెక్ దేశాలు ఆయిల్ సరఫరాపై తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే
ఎన్నికల ఫలితాలపై మార్కెట్లేమంటున్నాయ్!
Thursday 6th December 2018స్టాక్‌మార్కెట్లకు అస్థిరత అస్సలు నచ్చదు. దేశ రాజకీయ రంగంపై ఎలాంటి సందిగ్ధత కనిపించినా మార్కెట్లు భారీగా భయపడుతుంటాయి. ఎన్నికల సీజన్లో మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువ. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటి ఫలితాలపై మార్కెట్లు ఏమనుకుంటున్నాయి, ఎలా ప్రతిస్పందిస్తాయనేది ఆసక్తికరమైన అంశం. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మూడు హిందీబెల్ట్ రాష్ట్రాల ఫలితాలు