STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి..

Saturday 13th October 2018
Markets_main1539407274.png-21099

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో 10,518 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,486 పాయింట్లతో పోలిస్తే 32 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 
కాగా ముడి చమురు ధరలు చల్లబడటం, రూపాయి రికవరీ కావడం వంటి సానుకూలాంశాల కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. గురువారం అమ్మకాల వెల్లువతో కకావికలమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కొనుగోళ్ల జోరుతో కళకళలాడింది. వరుస రెండు రోజుల పతనం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం కూడా కలసివచ్చింది. ఇటీవల పతనం కారణంగా నష్టపోయి ఆకర్షణీయంగా మారిన పలు షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. ఐటీ, టెక్నాలజీ షేర్లు మినహా, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్‌, గ్యాస్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంక్‌, విద్యుత్తు, ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 732 పాయింట్లు (2.15 శాతం) లాభపడి 34,734 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 237 పాయింట్లు (2.32 శాతం) పెరిగి 10,492 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పెరగటం దాదాపు 30 నెలల విరామం తర్వాత ఇదే మొదటిసారి.



You may be interested

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌

Saturday 13th October 2018

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 287 పాయిం‍ట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం మొత్తంగా చూస్తే ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌

అవే తప్పులు మళ్లీ మళ్లీ... అందుకే నష్టాలు...? 

Friday 12th October 2018

దీర్ఘకాలం కోసమని భారీగా పెట్టుబడి పెట్టిన వారు తాజా పతనంలో తమ పోర్ట్‌ఫోలియో విలువ చూసుకుని కంగారుపడిపోయే పరిస్థితి నెలకొంది. తాజా పతనంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంపద భారీగా(రూ.17 లక్షల కోట్లకు పైగా) కోతకు గురైంది.  మార్కెట్‌ ఓ పెద్ద టీచర్‌. ఏ తప్పులు చేయరాదో చెబుతూనే ఉంటుంది. కానీ, ఇన్వెస్టర్లుగా మనం వాటిని పట్టించుకోం... పట్టించుకున్నా... మార్కెట్‌ మాయలో గుర్తుంచుకోం.     ‘‘తాజా పతనం నుంచి నేర్చుకున్న అతిపెద్ద పాఠం... రోమ్‌

Most from this category