STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు అప్‌

Wednesday 13th February 2019
Markets_main1550028626.png-24162

అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల పెరగడానికి తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50  గంటలకు 10,893పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,860 పాయింట్ల వద్ద ముగిసింది.  గత రాత్రి అమెరికా  సూచీలు 1.5 శాతం మేర పెరగ్గా, యూరప్‌ సూచీలుకూడా 1 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. తాజాగా జపాన్‌ సూచీ 1.5 శాతం లాభాల్లో ట్రేడవుతుండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘై, కొరియా కోస్పి ఇండెక్స్‌లు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ 1 శాతం వరకూ పెరిగింది. తైవాన్‌ సూచి మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ అప్‌ 40 పాయింట్లు

Wednesday 13th February 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌126 పాయింట్ల పెరుగుదలతో 36,280 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 10870 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం​ రోజు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించిన సన్‌ఫార్మా 2.5 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 500 వద్ద మొదలై నిఫ్టీ-50లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ ఐటీసీ 2 శాతంపైగా పెరిగి

నాలుగో రోజూ నష్టాలే..!

Tuesday 12th February 2019

10850 దిగువకు నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ కీలక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన అమ్మకాలతో మార్కెట్‌ మంగళవారం  నష్టాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్ల పతనంతో సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 10850 స్థాయిని కోల్పోయి 57పాయింట్లను నష్టంతో 10,831.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు పతనమై 36,153.62 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఈ నాలుగు రోజుల పతనంలో భాగంగా

Most from this category