STOCKS

News


కోలుకున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 15th August 2019
Markets_main1565854730.png-27787

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం నాటకీయంగా భారీ నష్టాల నుంచి కోలుకుంది. గత రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమైన నేపథ్యంలో  గురువారం ఉదయం 10,900 పాయింట్ల దిగువకు 10,894 పాయింట్ల వద్దకు పడిపోయిన ఈ సూచీ....తాజాగా ఆసియా మార్కెట్లు కూడా నష్టాల నుంచి రికవరీ అవుతున్న కారణంగా కనిష్టస్థాయి నుంచి బాగా కోలుకుంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 12.30 గంటల సమయంలో పాయింట్ల 50 నష్టంతో 10,978 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11028 పాయింట్లతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. 
అమెరికా మార్కెట్‌ క్రాష్‌:- 
ఆర్థిక మాంద్యం ఆవహిస్తున్న సంకేతాలు బాండ్ల మార్కెట్ల నుంచి వెలువడటంతో గతరాత్రి అమెరికా మార్కెట్లు 3శాతం పతనమయ్యాయి.  డో జోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 800 పాయింట్ల మేర కుప్పకూలింది. ఈ ప్రభావంతో గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైన ఆసియా స్టాక్‌ సూచీలు వాటి నష్టాల్లో కొంతభాగాన్ని పూడ్చుకోగలిగాయి. తొలుత 2 శాతం వరకూ పడిపోయిన సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌ 1.2శాతం నష్టంతో ముగియగా,. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 1.25శాతం క్షీణించింది. తైవాన్‌ వెయిటేజ్‌ జకర్తా కాంపోసిట్‌ 1శాతం, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ అరశాతం నష్టపోయాయి. మరోవైపు భారీ నష్టాల నుంచి కోలుకున్న హాంగ్‌సెంగ్‌ అరశాతం లాభంతో ముగిసింది. అయితే, సౌత్‌ కొరియాలో నేడు పబ్లిక్‌ హాలిడే సందర్భంగా ఆదేశ సూచీ కోప్పి ఇండెక్స్‌ పనిచేయడం లేదు. 



You may be interested

‘జీ’ హుజూర్‌..మోకరిల్లిన ట్రంప్‌

Thursday 15th August 2019

బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...చైనా అధ్యక్షుడి ముందు దాదాపు మోకరిల్లినంత పనిచేశారు. రెండెళ్లు, పదేళ్ల యుఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌ల మధ్య ఇన్వర్షన్‌ జరగడంతో (పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ని రెండేళ్ల బాండ్‌ ఈల్డ్‌ మిం‍చిపోవడం) గత సెషన్‌లో యుఎస్‌ డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ సూచీ 800 పాయింట్లు కుప్పకూలింది. ఇలా ఇన్వెర్షన్‌ జరగడం సమీప భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం కమ్మేస్తుందనడానికి సంకేతం. 2007 మహా మాంద్యం తర్వాత...ఇలా ఈల్డ్‌

ఐకియా సభ్యులకు..స్వీడన్‌ ఆఫర్‌

Thursday 15th August 2019

సాక్షి, హైదరాబాద్‌:- ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా  ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని స్టోర్‌లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.మెంబర్‌షిప్‌ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్‌ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో ఓటింగ్‌ పెడతామని, సెప్టెంబర్‌ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన

Most from this category