STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Friday 9th November 2018
Markets_main1541734059.png-21798

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 34 పాయింట్ల నష్టంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,614 పాయింట్లతో పోలిస్తే 33 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా గురువారం మిశ్రమంగానే ముగిశాయి. కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌కు గురువారం బలి ప్రతిపాద సందర్భంగా సెలవు.

నష్టాల్లో ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 26 పాయింట్ల నష్టంతో 3,066 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 115 పాయిం‍ట్ల నష్టంతో 9,830 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 2,617 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,086 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 544 పాయింట్ల నష్టంతో 25,682 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 148 పాయింట్ల నష్టంతో 22,338 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

డౌజోన్స్‌ అప్‌.. మిగతావి డౌన్‌..
ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.04 శాతం లేదా 10 పాయిం‍ట్ల లాభంతో 26,191 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.25 శాతం లేదా 7 పాయింట్ల నష్టంతో 2,806 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.53 శాతం లేదా 39 పాయింట్ల నష్టంతో 7,530 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎనర్జీ స్టాక్స్‌ బాగా పడిపోయాయి.



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 9th November 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.04 శాతం లేదా 10 పాయిం‍ట్ల లాభంతో 26,191 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.25 శాతం లేదా 7 పాయింట్ల నష్టంతో 2,806 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.53 శాతం లేదా 39

ఇమామి...కొనొచ్చు-ఆనంద్‌ రాఠి

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఇమామి స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఇమామి రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.421 టార్గెట్‌ ప్రైస్‌: రూ.595 ఆనంద్‌రాఠి.. ఇమామిపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.595గా నిర్ణయించింది. కీలకమైన వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించడం, పలు ఉత్పత్తుల రి-లాంచ్‌, మార్కెట్‌ వాటా పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, మేనేజ్‌మెంట్‌

Most from this category