STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Saturday 11th August 2018
Markets_main1533970452.png-19176

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి విదేశీ మార్కెట్లో 24 పాయింట్ల నష్టంతో 11,415 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మన మార్కెట్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపుకన్నా తక్కువ స్థాయిలో ఉందని గమనించాలి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తనప్పుడు సోమవారం నిఫ్టీ నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ఉండటం ప్రతికూల అంశం. నాస్‌డాక్‌ 53 పాయింట్ల నష్టంతో 7,839 వద్ద, డౌజోన్స్‌ 196 పాయింట్ల నష్టంతో 25,313 వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 20 పాయింట్ల నష్టంతో 2,833 వద్ద ముగిసాయి. కాగా శుక్రవారం నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,429 వద్ద ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్ల క్షీణతతో 37,869 స్థాయి వద్దకు పతనమైంది.
వేదాంత ఏడీఆర్‌ 4.89 శాతం డౌన్‌
నాస్‌డాక్‌ ఇండెక్స్‌లో శుక్రవారం ఇండియన్‌ కంపెనీల ఏడీఆర్‌లు నష్టాల్లోనే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.66 శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.48 శాతం, వేదాంత ఏడీఆర్‌ 4.89 శాతం, విప్రో ఏడీఆర్‌ 0.59 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.26 శాతం, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 3.04 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.19 శాతం క్షీణించాయి. దాదాపు స్థిరంగా ట్రేడయ్యే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ సైతం క్షీణించడానికి...ఆ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీనామా చేయడం కారణం.
 



You may be interested

ఐపీఓకు నిహిలెంట్‌ టెక్నాలజీస్‌

Saturday 11th August 2018

ముంబై:- ఐటీ సెల్యూషన్స్‌ కంపెనీ నిహిలెంట్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు సిద్ధమైంది. అందుకు సంబంధిత ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి సమర్పించింది. ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో మొత్తం 21.25లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.250 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీఓ ప్రక్రియకు మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గానూ, లింక్‌

సిటియూనియన్‌ బ్యాంకును కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 11th August 2018

ముంబై:- ఇటీవలే ప్రైవేట్‌ రంగ దిగ్గజం సిటి యూనియన్‌ బ్యాంకు ఇటీవలే త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఫలితాలను సాధించి మార్కెట్‌ వర్గాలను మెప్పించగలిగింది. దీంతో పలు రేటింగ్‌ సంస్థలు, బ్రేకరేజ్‌ సంస్థలు సిటియూనియన్‌ బ్యాంకు షేరుపై సానుకూలంగా ఉన్నాయి. వాటిలో ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఈ బ్యాంకు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ షేరుపై విశ్లేషణ

Most from this category