STOCKS

News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th March 2019
Markets_main1552729017.png-24642

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి 11,500 పాయింట్లపై 11,506 వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11470 పాయింట్లతో పోలిస్తే 36పాయింట్ల లాభంతో ఉంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు పాలసీ సమావేశాలు వచ్చేవారం మంగళ(19న), బుధ(20న) వారాల్లో జరగనున్నాయి. అమెరికాతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై ఈసారి యధాతథ పాలసీని అవలంభించవచ్చని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై యథాతధ పాలసీ మన దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే యూరోజోన్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ పాలసీ నిర్ణయాలు గురువారం(21న) వెలువడనున్నాయి. మరోవైపు యూరోపియన్‌ యూనియన్‌ నంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ బ్రెగ్జిట్‌పై అనిశ్చితి కొనసాగుతుంది. ఇక దేశయంగా పరిణామాలు చూసినట్లైతే.. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్)లో కరెంట్‌ ఖాతా లోటు గణాంకాలు 19న విడుదలకానున్నాయి. ఈ గణాంకాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు, రూపాయినీ ప్రభావితం చేయవచ్చని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువలా వస్తుండటం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో గతవారం సూచీలు భారీ లాభపడ్డాయి. ఈ వారం మొత్తంలో సెన్సెక్స్‌ సూచీ 1352 పాయింట్లను, నిఫ్టీ 391 పాయింట్లను ఆర్జించాయి.



You may be interested

5నెలల గరిష్టం వద్ద ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 16th March 2019

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి లాభాలతో ముగిశాయి. టెక్నాలజీస్‌ షేర్ల ర్యాలీ ఇందుకు కారణమైంది. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 14పాయింట్లు పెరిగి 2,822.48 వద్ద స్థిరపడింది. ఇది ఈ సూచీకి 5నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 57 పాయింట్లు లాభపడి 7,688.53 వద్ద, డోజోన్స్‌ ఇండెక్స్‌ 139 పాయింట్లు ర్యాలీ చేసి 25,849 వద్ద ముగిశాయి. అమెరికా - చైనాల మధ్య జరిగిన వాణిజ్య

బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు @ రూ. 90వేల కోట్లు

Saturday 16th March 2019

- నిధులు సమకూర్చడం లేదా మూసేయడం రెండే మార్గాలు - కోటక్‌ ఈక్విటీస్ నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్ఎల్ నష్టాలు డిసెంబర్ ఆఖరు నాటికి ఏకంగా రూ. 90,000 కోట్లు దాటిపోయాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు పెట్టి కంపెనీని నిలబెట్టడమా లేదా వ్యయాలు తగ్గించుకునేందుకు సంస్థను మూసేసి వన్‌ టైమ్ భారాన్ని భరించడమా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి

Most from this category