STOCKS

News


నష్టాలకు బ్రేక్‌

Friday 7th December 2018
Markets_main1544178821.png-22736

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 361 పాయింట్ల లాభంతో 35673 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 92.50 పాయింట్ల లాభంతో 10693 వద్ద ముగిశాయి. గత కొద్ది రోజులుగా భారీ అమ్మకాలతో తల్లడిల్లిన ప్రపంచమార్కెట్లు తిరిగి లాభాల్లో మళ‍్లడం, రూపాయి రీకవరీ తదితర అంశాలు నేటి సూచీల లాభాల ర్యాలీకి కారణమని చెప్పవచ్చు. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 391పాయింట్లు(1.50శాతం) లాభపడి 26,594.30 వద్ద స్థిరపడింది. ఇదే ఎన్‌ఎస్‌ఈలో కోటక్‌ బ్యాంక్‌ 9శాతం ర్యాలీ కారణంగా నిఫ్టీ ప్రైవేట్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది. అలాగే ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. మరోవైపు మెటల్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నీరసించడం, రూపాయి రికవరీతో మార్కెట్‌ నేడు లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 35,494 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 10,644  ప్రారంభమైంది. మన మార్కెట్‌ ప్రారంభానికి ఆసియాలో అధికశాతం మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్ల సందడి మొదలైంది. కోటక్‌ బ్యాంకులో వారెన్‌ బఫెట్‌ పెట్టుబడులు పెడతారనే వార్తలతో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభాల ర్యాలీ చేశాయి. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సుల్లో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. మిడ్‌సెషన్‌ వరకు పరిమితంగా ర్యాలీ చేసిన సూచీలు అనంతరం యూరప్‌ మార్కెట్‌ లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహానిచ్చింది. మిడ్‌సెషన్‌ అనంతరం ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు సూచీలను పరుగులెత్తించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 418 పాయింట్లు లాభపడి 35,730 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభపడి 10,704.55 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే నేడు ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనుండటంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, రూపాయి బలపడటంతో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ షేర్ల క్షీణత, మెటల్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల లాభాలకు కొంత అడ్డుకట్ట పడింది. చివరకు సెన్సెక్స్‌ 35673.25 వద్ద, నిఫ్టీ 10,693.70 వద్ద ముగిశాయి.
బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌అటో, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ఫైనాన్స్‌ సర్వీసెస్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 9శాతం లాభపడగా, కోల్‌ ఇండియా, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, గెయిల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోయాయి.



You may be interested

నష్టాలను పరిమితం చేసుకోవడమే ప్రధానం

Friday 7th December 2018

కొంచెం లాభం వచ్చిన వెంటనే స్టాక్స్‌ను అమ్మేయడం, కొంచెం నష్టం వస్తే మాత్రం అమ్మేయకుండా చూద్దాంలే అని కొనసాగించడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేసే పని ఇది. కానీ, కొన్ని లెక్కలు లేకుండా షేరు మార్కెట్లో డబ్బులు సంపాదించడం కష్టమంటున్నారు శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోది. నష్టాలు రాకుండా చూసుకోవం కంటే, వాటిని పరిమితం చేసుకోవడం అవసరమన్నారు. ఇందుకోసం ఏం చేయాలో కూడా ఆయన సూచించారు.   స్టాప్‌లాస్‌ను  పెట్టుకోవడం చాలా

ఈ 5 షేర్లు రక్షణాత్మకం

Friday 7th December 2018

ముంబై: వచ్చే ఏడాది చివరి వరకు దేశీ మార్కెట్‌ పతనం దిశగానే ఉండనుండగా.. ఈకాలంలో ఒడిదుడుకులు కూడా అధిక స్థాయిలోనే ఉండేందుకు అవకాశం ఉందని నిర్మల్ బాంగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, రీసెర్చ్ హెడ్ గిరీష్ పై విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణనిచ్చే షేర్లలో పెట్టుబడి చేయడం సరైన నిర్ణయమని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పెట్టుబడి, విలువ రక్షణకు అనుగుణంగా ఉన్నటువంటి షేర్లలో

Most from this category