STOCKS

News


36000 దిగువన సెన్సెక్స్‌

Thursday 14th February 2019
Markets_main1550139898.png-24201

  • 10750 దిగువకు నిఫ్టీ సూచీ
  • ఆరోరోజూ అమ్మకాలే..!

అధిక పరిమాణం కలిగిన షేర్ల పతనంతో మార్కెట్‌ ఆరో రోజూ నష్టపోయింది.  ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10750 మార్కును కోల్పోయి 47 పాయింట్లు నష్టంతో 10,746 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 158 పాయింట్లను కోల్పోయి 36వేల దిగువన 35,876 వద్ద ముగిసింది. ఈ 6రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 1099 పాయింట్లను పోగొట్టుకుంది. మరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 26,995 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, ఫార్మా, అటో, రియల్టీ రంగ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. ఐటీ, మెటల్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రంగ సూచీలు నష్టాలతో ముగిశాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు మార్కెట్‌ మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 31 పాయింట్ల లాభంతో 36,065, నిఫ్టీ సూచీ 7 పాయింట్ల నష్టంతో 10,786 వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించాయి. ప్రపంచ మార్కెట్లలో సంకేతాలు బలంగా ఉన్నప్పటికీ.., దేశీయ మార్కెట్‌లో మాత్రం కొనుగోళ్ల ఏదశలో జరగలేదు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐఓసీ షేర్ల పతనం సూచీలకు అధిక నష్టాన్ని కలిగించింది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 335 పాయింట్లను కోల్పోయి 35779 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లను నష్టపోయి 10,719 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అయితే మిడ్‌సెషన్‌ అనంతరం ఐరోపా యూర్కెట్ల లాభాల ప్రారంభం, చివరి గంటలో స్వల్ప కొనుగోళ్లతో సూచీలు కొంత రికవరీని సాధించాయి. 
గెయిల్‌, భారతీఎయిర్‌టెల్‌, హిందాల్కో, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం నష్టపోగా, టాటామోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ లిమిటెడ్‌, ఇండియన్‌ బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 31శాతం లాభపడ్డాయి. 



You may be interested

కరూర్‌ షేరు క్రాష్‌

Thursday 14th February 2019

గురువారం ఇంట్రాడేలో కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ షేరు దాదాపు 18శాతం వరకు  పతనమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో రూ. 63.20 కనిష్ఠస్థాయిని చూసింది. అనంతరం కోలుకొని 15 శాతం నష్టంతో 67. 15 రూపాయల వద్ద ముగిసింది. ఈ రోజు కనిష్ఠం 52 వారాల కనిష్ఠ ధర కావడం గమనార్హం. క్యు3 ఫలితాల సందర్భంగా మేనేజ్‌మెంట్‌ చేసిన గైడెన్స్‌ ప్రకటన షేరుపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదు త్రైమాసికాల్లో రూ.1000 కోట్ల

ఎన్నికల భయంతో ఇండియాకు దూరం..

Thursday 14th February 2019

దేశీయ ఈక్విటీలపై ఆసక్తి చూపని విదేశీ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాది వర్ధమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే ఇండియా ఈక్విటీలు నీరస ప్రదర్శన చేశాయి. త్వరలో సాధారణ ఎన్నికలు జరుతున్న సమయాన దేశీయ ఈక్విటీలపై ఫండ్‌ మేనేజర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో భారత మార్కెట్లు దూసుకుపోలేకపోతున్నాయి. ఇదే సమయంలో విదేశీ ఫండ్‌ మేనేజర్లు ఇతర వర్ధమాన మార్కెట్లపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. ఈ ఏడాదిలో ఇంతవరకు నిఫ్టీ 0.63 శాతం నష్టపోగా,

Most from this category