News


రికమండేషన్‌ అష్టపది

Saturday 8th December 2018
Markets_main1544263756.png-22773

వచ్చే సంవత్సర కాలానికి మంచి రాబడిని అందించే షేర్లు ఎనిమిది రంగాల్లో లభిస్తాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ చెబుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రంగాలను, వీటిలోని నాణ్యమైన స్టాకులను ఎంచుకోవాలని సూచిస్తోంది. 
1. అటోమొబైల్స్‌: క్రూడాయిల్‌ ధరలు తగ్గడం బాగా కలిసిరానుంది. చాలా స్టాకులు ఆకర్షణీయమైన వాల్యూషన్లకు చేరుతున్నాయి. ముడిపదార్ధాల ధరల్లో స్థిరత్వం వస్తే మరింత దూసుకుపోనుంది.
2. ఆటో విడిభాగాలు: విడిభాగాల డిమాండ్‌, వాల్యూంల్లో వృద్ది ఆరోగ్యకరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టైర్ల కంపెనీల స్టాకులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎగుమతులు, కరెన్సీ బలపడడం ఈ రంగంలో మరింత వృద్దిని పెంచుతాయి.
3. కార్పొరేట్‌ బ్యాంక్స్‌: లోన్లు- నష్టాలు తగ్గడంతో ఎర్నింగ్స్‌ను వృద్ధి పరచనున్నాయి. ఎన్‌సీఎల్‌టీ తీర్పులతో నిధుల రాబడి పెరగనుంది. 
4. నిర్మాణపదార్ధాలు: పదేళ్ల సరాసరి కన్నా దిగువకు వాల్యూషన్లు పడిపోయాయి. వచ్చే ఏడాది ఎర్నింగ్స్‌లో 25 శాతం వరకు పెరుగుదల ఉంటుంది.
5. నిర్మాణం: ఎన్‌బీఎఫ్‌సీ ఫండింగ్‌ అంశం, ఎన్నికల అస్థిరత అంశంలాంటివి వచ్చే ఏడాది మధ్యకాలానికి సమసిపోతాయి. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
6. విద్యుత్‌: కరెంట్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. పునర్వినియోగ ఇంధన వనరుల సామర్ధ్య విస్తరణ ఊపందుకుంది. 
7. మైనింగ్‌, మెటల్స్‌: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఈ రంగం మంచి మెరుగుదల నమోదు చేయనుంది. అల్యూమినియం స్టాకుల భవితవ్యం బాగుంది.
8. ఐటీ: రూపాయి ఇటీవల కాలంలో బాగా క్షీణించింది. ఈ క్షీణత ప్రభావం వచ్చే ఏడాది ఎర్నింగ్స్‌లో ప్రతిబింబిస్తుంది. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో డిమాండ్‌ ఆరోగ్యకరంగా ఉంది. You may be interested

అంబానీలు ఏం చేసినా ప్రత్యేకమే!!

Saturday 8th December 2018

5,000పైగా మందికి అన్నదాన కార్యక్రమం ఇతరుల సంతోషాన్ని కోరుకుంటే.. దేవుడు మనకు కూడా మంచే చేస్తాడని ఎక్కువ మంది విశ్వసిస్తుంటారు. దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ కూడా ఇలాగే అనుకున్నట్లున్నారు. అందుకేనేమో.. తన గారాలాపట్టీ ఇషా ముందస్తు పెళ్లి వేడుకులను అన్నదాన కార్యక్రమంతో ఎంతో ఘనంగా ఆరంభించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంబానీ కుటుంబ సభ్యులు శుక్రవారం రోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 5,100 మందికి కడుపు నిండా అన్నం పెట్టారు.

ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌కు బై రేటింగ్‌

Saturday 8th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.105 టార్గెట్‌ ప్రైస్‌: రూ.145 కోటక్‌ సెక్యూరిటీస్‌.. ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.145గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కంపెనీ ఆరోగ్యకరమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. రానున్న కాలంలో మంచి

Most from this category