మ్యూచువల్ ఫండ్స్ ఇకపై మరింత ఆకర్షణీయం!
By Sakshi

మ్యూచువల్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ నడుం బిగించింది. కొన్ని రకాల చర్యల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో వ్యయాలను తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు పలు రకాల పథకాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్స్పెన్స్ రేషియో (వ్యయాల నిష్పత్తి)లను సమీక్షించనుంది. సెబీ ఇటీవలే మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీల్లో భారీ మార్పులకు చర్యలు తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఉత్పత్తుల పంపిణీదారుల చానల్స్, ఇలా పలు రకాల కార్యకలాపాల్లో ఏకరూపత తీసుకురావాలన్నది సెబీ యోచన. పలు డిజిటల్ మార్గాల ద్వారా అవగాహన కల్పించడం వంటి చర్యలతో మ్యూచువల్ ఫండ్స్‌ను మరింత మందికి చేరువ చేయాలన్నది సెబీ సంకల్పం. భాగస్వాములకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు గాను... ఆన్లైన్ లావాదేవీలు, ఎక్స్పెన్స్ రేషియోల పరిశీలన వంటి చర్యలతో ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు సెబీ తన 2017-18 వార్షిక నివేదికలో పేర్కొంది. అడిషనల్ ఎక్స్పెన్స్ రేషియోను 20 బేసిస్ పాయింట్ల నుంచి 5 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తూ సెబీ జూన్ నెలలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుడులపై వ్యయాలను తగ్గించడమే సెబీ ఉద్దేశ్యం. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్లు కూడా తగ్గిపోనున్నాయి. 2017-18లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ పెట్టుబడుల పరంగా మంచి వృద్ధిని నమోదు చేసింది. రూ.2.09 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.1.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 2017 మార్చి నాటికి ఉన్న రూ.17.54 లక్షల కోట్ల నుంచి 2018 మార్చి నాటికి రూ.21.36 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఇది రూ23 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం గమనార్హం.
You may be interested
హెచ్డీఎఫ్సీ ఏఎంపీ ఐపీవో లాభంపై పన్ను పడుద్ది
Sunday 12th August 2018మీరు రిటైల్ ఇన్వెస్టర్లా...? ఇటీవలే ఐపీవోకు వచ్చి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో పాల్గొని మంచి లాభాన్ని కళ్ల జూశారా? అయితే మీకు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉన్నట్టే. ఐపీవోలో ఒక్కో షేరు రూ.1,100కు కేటాయించగా, రూ.1,739 వద్ద కంపెనీ లిస్ట్ అయిన విషయం తెలిసే ఉంటుంది. అంటే ఒక్కో షేరుపై రూ.639 లాభం అనమాట. ప్రస్తుతం షేరు రూ.1,739.40 స్థాయిలో ఉంది. అమ్మకుండా ఉంచుకున్న వారి
‘ఈక్విటీ99’ నుంచి మూడు స్టాక్ సిఫారసులు
Sunday 12th August 2018నిఫ్టీ, సెన్సెక్స్ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ వెళుతున్నాయి. ప్రతీ చిన్న కరెక్షన్‌లోనూ కొనుగోళ్లు చేసుకుంటున్నాయి. దీంతో మార్కెట్లు గతంతో పోలిస్తే బలంగా కనిపిస్తున్నాయి. తమ అంచనాల ప్రకారం ఈ స్థాయిల్లో మార్కెట్లు స్థిరీకరణ చెందుతాయని ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్ బిల్‌గయాన్ పేర్కొన్నారు. నాణ్యమైన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సైతం ర్యాలీ చేస్తాయని అంచనా వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలో వృద్ధికి అవకాశం ఉన్న మూడు స్టాక్స్‌ను