STOCKS

News


4 కంపెనీల ఆస్తులు వేలం వేయనున్న సెబీ

Saturday 13th October 2018
news_main1539409500.png-21109

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్మును రాబట్టే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నాలుగు కంపెనీల ఆస్తులను వేలం వేయనుంది. స్వర్ ‍ఆగ్రోటెక్‌, లైఫ్‌ కేర్ ఇన్‌ఫ్రాటెక్‌, సర్వ్‌హిట్ హౌసింగ్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రాఘవ్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన ఆరు ప్రాపర్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర మొత్తం రూ. 4.74 కోట్లుగా సెబీ నిర్ణయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఈ ఆస్తులను నవంబర్ 11న వేలం వేయనున్నట్లు సెబీ శుక్రవారం ఒక నోటీసులో వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు లేకుండా సమూహ పెట్టుబడుల పథకాల (సీఐఎస్‌) కింద స్వర్ ఆగ్రోటెక్‌, రాఘవ్ క్యాపిటల్, సర్వ్‌హిట్ హౌసింగ్ సంస్థలు ప్రజల నుంచి నిధులు సమీకరించాయి. లైఫ్‌ కేర్ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ పబ్లిక్ ఇష్యూ నిబంధనలను పాటించకుండా సెక్యూరిటీస్ జారీ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది.



You may be interested

సుంకాల పెంపుతో దిగుమతులు భారం

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగించే కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల దిగుమతుల వ్యయాలు దాదాపు పది శాతం మేర పెరిగిపోతాయని సెల్యులార్‌ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. అయితే, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోఏఐ తెలియజేసింది. సాధారణంగా ఆపరేటర్లు ఏటా దాదాపు 8

బిగ్‌ ఛాలెంజ్‌ డే..!

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ–కిరాణాలో హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ పోటీ దిగ్గజ విదేశీ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల మధ్యనే తారస్థాయిలో కొనసాగుతోంది. భారత ఆన్‌లైన్‌ అంగడిలో నెంబర్‌ వన్‌ ర్యాంకును, సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకోవడం కోసం పోటీకి ఎదురు నిలబడి... ఇరు సంస్థలు భారీ ప్రకటనలు, ధీటైన సవాళ్లతో హోరెత్తిస్తున్నాయి. జరుగుతున్నది పోటీనే అని నేరుగా ఒప్పుకోకపోయినా, ప్రత్యక్ష వ్యాఖ్యలతో చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడి మార్కెట్లో తమకు

Most from this category