STOCKS

News


రేటింగ్‌ ఏజెన్సీలకు సెబీ కఠిన నిబంధనలు

Friday 14th June 2019
news_main1560496219.png-26294

  • ఎగవేతలపై ముందుగానే అప్రమత్తతకు వీలు

న్యూఢిల్లీ: క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలకు సంబంధించి కఠిన నిబంధనలను సెబీ తీసుకొచ్చింది. పలు ఇనుస్ట్రుమెంట్ల డిఫాల్ట్‌ అవకాశాలను రేటింగ్‌ ఏజెన్సీలు ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. రుణాల చెల్లింపుల్లో పలు కంపెనీలు విఫలమవుతున్న ఘటనలు పెరిగిపోవడంతో సెబీ కఠిన నిబంధనలు తీసుకొచ్చినట్టయింది. సెబీతో సంప్రదింపుల అనంతరం క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ప్రతీ రేటింగ్‌ విభాగంలో డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలపై ఓ ప్రామాణిక ఏకీకృత బెంచ్‌ మార్క్‌ ప్రమాణాలను తీసుకురావాల్సి ఉంటుందని సెబీ ఆదేశాలు స్పష్టం చేశాయి. చెల్లింపుల్లో విఫలమవడాన్ని సకాలంలో గుర్తించేందుకు ఓ ప్రమాణిక నిర్వహణ ప్రక్రియ అవసరమని సెబీ పేర్కొంది. రేటింగ్‌లను పెంచడం, తగ్గించే సంకేతాలను తెలియజేస్తూ రేటింగ్‌ ఏజెన్సీలు పత్రికా ప్రకటనల్లో రేటింగ్‌ సున్నితత్వం పేరుతో ఓ విభాగాన్ని నిర్వహించాలని కూడా ఆదేశించింది. లిక్విడిటీ విషయంలోనూ తగినంత సమాచారాన్ని వెల్లడిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 



You may be interested

సగం వాటా విక్రయిస్తాం !

Friday 14th June 2019

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ ఆఫర్‌  వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు!  న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో 50 శాతం వాటాను విక్రయించనున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటరైన వాధ్వాన్‌ కుబుంబం ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే, యాజమాన్య బాధ్యతల నుంచి కూడా వైదొలగడానికి కూడా ప్రమోటర్లు సిద్ధంగా ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

కంపెనీ డైరెక్టర్ల ఆస్తుల జప్తునకు అనుమతించాలి

Friday 14th June 2019

బకాయిల వసూళ్లకు ఐబీసీ ఉపయోగపడడం లేదు ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లను జవాబుదారీ చేయాలి బ్యాంకు ఉద్యోగుల సంఘం సూచనలు ముంబై: రుణాలను ఎగ్గొట్టే వారి విషయంలో మరిన్ని కఠిన చర్యలకు వీలు కల్పించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కేంద్ర ఆర్థిక మంత్రిని డిమాండ్‌ చేసింది. తీసుకున్న రుణాలను చెల్లించకుండా ముఖం చాటేసే కంపెనీల డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలని బడ్జెట్‌ ముందస్తు వినతుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక

Most from this category