STOCKS

News


బంధన్ బ్యాంక్‌కు సెబీ ఊరట

Saturday 13th October 2018
Markets_main1539410175.png-21116

ముంబై: ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ తగ్గింపు విషయానికి సంబంధించి బంధన్ బ్యాంక్‌కు కొంత ఊరట లభించింది. లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు ఏడాది దాకా వాటాలను విక్రయించకుండా చేసే నిబంధన విషయంలో తమకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపు లభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్‌ లైసెన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటింగ్ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (బీఎఫ్‌హెచ్‌ఎల్‌).. బంధన్ బ్యాంకులో తనకున్న 82 శాతం వాటాలను 40 శాతానికి తగ్గించుకోవాలి. లాకిన్ వ్యవధి నిబంధనలు తదితర అంశాల నేపథ్యంలో బీఎఫ్‌హెచ్‌ఎల్‌ దీన్ని అమలు చేయడంలో విఫలమైంది.  ఇందుకు గాను బంధన్ బ్యాంకు.. కొత్త శాఖలు తెరవకుండా, ఎండీ చంద్రశేఖర్ ఘోష్ జీతభత్యాలను పెంచకుండా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో లాకిన్ వ్యవధికి సంబంధించి సెబీ కొంత మినహాయింపునిచ్చింది. దీంతో ప్రమోటర్ వాటాను తగ్గించుకునేందుకు ఆఫర్‌ ఫర్ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) లేదా ఇతర సంస్థల విలీన, కొనుగోలు తదితర మార్గాలను పరిశీలించనున్నట్లు ఘోష్ తెలిపారు.



You may be interested

ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6.88% అప్‌

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6.88 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సర ఏప్రిల్‌–సెప్టెంబరు కాలానికి 17,44,305 యూనిట్లు అమ్ముడవగా.. గతేడాది ఈ కాలంలో 16,32,006 యూనిట్లు అమ్ముడయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ పెరగడం, నూతన వాహనాల విడుదల కారణంగా 6.88 శాతం వృద్ధి

రూపాయి... ఒకే రోజు 55పైసలు లాభం

Saturday 13th October 2018

ముంబై: ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌  మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడింది. గడచిన మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో

Most from this category