STOCKS

News


క్లయింట్ల నుంచి నగదు స్వీకరించొద్దు: సెబీ

Friday 13th July 2018
Markets_main1531422477.png-18272

స్టాక్‌ బ్రోకర్లు తమ క్లయింట్ల నుంచి నగదు స్వీకరించొద్దని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్లయింట్ల నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి స్టాక్‌ బ్రోకర్లు నగదు తీసుకోకుండా నిషేధించింది. అయితే, ఐపీవో ఆఫర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు గాను ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సెబీ ఉంది. అలాగే, లిస్టింగ్‌ ప్రక్రియను కూడా శీఘ్రతరం చేయనుంది. ‘‘ఈ రోజు ఎలక్ట్రానిక్‌ విధానంలో చెల్లింపులకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో తమ క్లయింట్ల నుంచి స్టాక్‌ బ్రోకర్లు నేరుగా నగదు కానీ, లేదా తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమలు కానీ అనుమతించొద్దని ఆదేశిస్తున్నాం’’ అంటూ సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. క్లయింట్ల నుంచి అన్ని రకాల చెల్లింపులను అకౌంట్‌ పేయీతో కూడిన క్రాస్డ్‌ చెక్కులు లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు లేదా ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నగదు బదిలీ లేదా ఆర్‌బీఐ అనుమతించిన ఏదేనీ ఇతర చెల్లింపుల మాధ్యమం ద్వారానే స్వీకరించాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 



You may be interested

97 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Friday 13th July 2018

0.70 శాతం లాభాల్లో ఉన్న నిఫ్టీ ఐటీ 0.02 శాతం లాభపడి 27,032 వద్ద ట్రేడవుతోన్న బ్యాంక్‌ నిఫ్టీ ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 11,050 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించగా.. సెన్సెక్స్‌ 97 పాయింట్లు లాభపడి 36,645 దగ్గర ప్రారంభమయ్యింది. 9 గంటల 30 నిమిషాల సమయానికి నిఫ్టీ 39 పాయింట్లు (0.38 శాతం) లాభపడి 11,064 దగ్గర ట్రేడవుతోంది. 11,071

18 ఏళ్లు రాగానే తెలుసుకోవాల్సిన ఆర్థిక అంశాలు

Friday 13th July 2018

తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లల పేరిట ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీంతో వారి మైనర్‌ పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలు, పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు ఉంటాయి. అయితే, వారికి 18 ఏళ్లు వచ్చిన వెంటనే వాటికి హక్కుదారులుగా, నిర్వాహకులుగా మారిపోతారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు మైనారిటీ తీరిన వారి పేరిట ఉన్న పెట్టుబడులను ఫ్రీజ్‌ చేసేస్తాయి. మేజర్‌ అయిన వెంటనే పూర్తి వివరాలతో, డాక్యుమెంట్లతో, తమ సంతకంతో రికార్డులను

Most from this category