STOCKS

News


ఎస్‌బీఐ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం

Saturday 8th December 2018
news_main1544239748.png-22740

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.20,000 కోట్ల నిధుల సమీకరణకు ఆ బ్యాంక్‌ వాటాదారుల ఆమోదం లభించింది. షేర్ల విక్రయం ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించనున్నామని, ఈ నిధుల సమీకరణకు తమ వాటాదారులు ఆమోదం తెలిపారని ఎస్‌బీఐ వెల్లడించింది. ముంబైలో జరిగిన వాటాదారుల సాధారణ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ నిధుల సమీకరణకు ఆమోదం లభించిందని పేర్కొంది. ఫాలో ఆన్‌ ఆఫర్‌ లేదా క్యూఐపీ/జీడీఆర్‌/ఏడీఆర్‌ లేదా మరే ఇతర మార్గాల్లో కానీ, వీటన్నింటి కలగలుపుగా కానీ రూ.20,000 కోట్ల మేర నిధులు సమీకరిస్తామని ఎస్‌బీఐ పేర్కొంది. నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం పొందిన వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్‌ 0.1 శాతం నష్టంతో రూ.275 వద్ద ముగిసింది. 


 



You may be interested

ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఐఎస్‌బీ ప్రొఫెసర్‌

Saturday 8th December 2018

న్యూఢిల్లీ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రొఫెసర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిని (సీఈఏ) ఈ ఏడాది జూలైలో వీడగా, అప్పటి నుంచి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు ఐఎస్‌బీ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమించాలన్న

9న నొవోటెల్‌ విజయవాడ ప్రారంభం

Saturday 8th December 2018

పటమట(విజయవాడ తూర్పు): విజయవాడలో వరుణ్‌ గ్రూపు రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న నొవోటెల్‌- వరుణ్‌ హోటల్‌ను ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు వరుణ్‌ గ్రూపు అధినేత వి.ప్రభు కిషోర్‌ చెప్పారు. 2009లో తాము ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టామని, అప్పటి నుంచి ఎప్పటికప్పుడు మరిన్ని గదులను జత చేసుకుంటూ ముందుకెళుతున్నామని చెప్పారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘విజయవాడ హోటల్లో 227 విలాసవంతమైన గదులతోపాటు నాలుగు ఫుడ్‌బేవరేజ్‌ అవుట్‌లెట్లు, ఏడు సమావేశ

Most from this category