STOCKS

News


మాల్యా కేసులో మెతగ్గా వ్యవహరించలేదు: ఎస్‌బీఐ

Saturday 15th September 2018
news_main1536987178.png-20270

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణ ఎగవేత ఖాతా వ్యవహారంలో మెతగ్గా వ్యవహరించలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌మాల్యా 2016 మార్చి 2న భారత్‌ నుంచి వెళ్లిపోయారు. అయితే, అతన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని 2016 ఫిబ్రవరిలోనే లీడ్‌ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ సూచించినప్పటికీ... ఆయన పరారైన నాలుగు రోజుల తర్వాత 13 బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టును ఆశ్రయించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ స్పందిస్తూ... ‘‘కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సహా రుణ ఎగవేత కేసుల వ్యవహారాల్లో ఎస్‌బీఐ తరఫున, అధికారుల వైపు ఎటువంటి అలక్ష్యం లేదు. ఎగవేతల మొత్తాన్ని రాబట్టుకునేందుకు చురుకైన, బలమైన చర్యలను బ్యాంకు తీసుకుంటోంది’’ అని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిలు చెల్లించాల్సిన విజయ్‌మాల్యా ఈ విషయంలో పలు కేసులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విజయ్‌ మాల్యా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తన కంపెనీ (కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌) ఆర్థిక పరిస్థితులు తెలిసీ ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులు తనకు అప్పిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకుల వైపు తప్పిదం ఉన్నా...  తనను రుణాల ఎగవేతలకు పోస్టర్‌బోయ్‌గా చిత్రీకరించారని ఆదేదన వ్యక్తం చేశారు. 



You may be interested

కుటుంబ వ్యాపారాల్లో భారత్‌ మేటి

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థలు ఆయా రంగాల్లోని ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే పనితీరులో మెరుగ్గా ఉండడంతోపాటు, వాటాదారులకు అధిక రాబడులు పంచిపెడుతున్నాయి. కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలు సంఖ్యా పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివరాలను ‘క్రెడిట్‌ సూసే ఫ్యామిలీ 1000, 2018’ నివేదిక పేరుతో క్రెడిట్‌ సూసే రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసింది. భారత్‌లో 111 వ్యాపార సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలో

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌లో అనుబంధ సంస్థ విలీనం

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌లో ఆ కంపెనీ అనుబంధ సంస్థ, ఆస్టెక్‌ లైఫ్‌ సైన్సెస్‌ విలీనానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డ్‌ ఈ మేరకు ఆమోదం తెలిపిందని గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ పేర్కొంది. ఈ విలీన ప్రణాళికలో భాగంగా ప్రతి 10 ఆస్టెక్‌​ లైఫ్‌ సైన్సెస్‌ షేర్లకు 11 గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ షేర్లను జారీ చేస్తామని తెలిపింది.  ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, స్టాక్‌

Most from this category