STOCKS

News


‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్‌ రికార్డు

Tuesday 16th April 2019
news_main1555394617.png-25161

  • 40 రోజుల్లో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. తన ‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రికార్డు సృష్టించినట్లు సోమవారం ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 20 లక్షల యూనిట్ల విక్రయాలు పూర్తిచేయగా.. వీటి విలువ దాదాపు రూ.3,500 కోట్లని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజివిజిత్ సింగ్ వెల్లడించారు. చిన్న నగరాలు, మెట్రోల నుంచి ఏ50, ఏ30, ఏ10 స్మార్ట్‌ఫోన్లకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారయన. కంపెనీ నిర్థేశించుకున్న 4 బిలియన్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తంచేశారు. వచ్చే కొద్ది వారాల్లోనే గెలాక్సీ ఏ80, ఏ70, ఏ2 కోర్ విడుదల ఉండనుందని వెల్లడించారు.



You may be interested

జీఎస్‌టీ ఆడిట్‌ రిపోర్టులను ఫైల్‌ చేయండి

Tuesday 16th April 2019

- రూ.2 కోట్ల టర్నోవర్‌ దాటితే ఫైలింగ్‌ తప్పనిసరి న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‌టీ ఆడిట్‌ రిపోర్టులు దాఖలు చేయడానికి (జీఎస్‌టీఎన్‌) నెట్‌వర్క్‌లో ఫార్మెట్‌ సిద్ధంగా ఉందని కౌన్సిల్‌ ప్రకటించింది. ఫైలింగ్‌కు ఆఖరి తేదీ జూన్‌ 30 కాగా, రూ.2 కోట్ల టర్నోవర్‌ దాటితే ఫైలింగ్‌ తప్పనిసరని సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌లోనే ఇందుకు సంబంధించిన ఫామ్‌లు.. జీఎస్‌టీఆర్‌-9 (సామాన్య ట్యాక్స్‌ పేయర్లకు), జీఎస్‌టీఆర్‌-9ఏ (కాంపోజిషన్‌ ట్యాక్స్‌ పేయర్లకు), జీఎస్‌టీఆర్‌-9సీ

శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

Tuesday 16th April 2019

ఇష్యూ సైజు రూ.1,250 కోట్లు  న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పచ్చజెండా ఊపింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,250 కోట్లు సమీకరిస్తుందని అంచనాలున్నాయి. ఈ విలువ పరంగా చూస్తే, ఈ కంపెనీ విలువ రూ.3,750 కోట్లని అంచనా. ఐపీఓ పత్రాలను గత ఏడాది డిసెంబర్‌లో సమర్పించిన ఈ కంపెనీ ఈ నెల 9న సెబీ

Most from this category