News


ఆప్షన్స్‌తో లాభాలకు రక్ష!

Saturday 16th March 2019
Markets_main1552734182.png-24644

పోర్టుఫోలియో హెడ్జింగ్‌కు ఆప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా లాభాలను రక్షించుకోవచ్చని మార్కెట్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
ఉదాహరణకు x అనే స్టాకు వంద రూపాయల వద్ద ట్రేడవుతుందనుకుందాం. మనం కొన్న తర్వాత ఈ స్టాకు రూ. 110కి చేరిందని భావించండి. అంటే వంద రూపాయల కొనుగోలుపై పదిరూపాయల లాభం కనిపిస్తోంది. ఈ లాభాన్ని కాపాడుకొనేందుకు ఒక 110 పుట్‌ కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడీ స్టాకు తిరిగి రూ. 110 దిగువకు వస్తే పుట్‌ ఆప్షన్‌ కారణంగా గతంలో వచ్చిన లాభం క్షీణించినా, పుట్‌లో కొత్తగా లాభం వస్తుంది. అంటే మొత్తం మీద కాస్త అటుఇటుగా ఆర్జించిన లాభం ఎటూ పోకుండా ఉంటుంది. ఒకవేళ స్టాకు ధర రూ. 110 నుంచి మరింత పైకి ఎగిసిపోతుంటే పాత పుట్‌ ఆప్షన్‌ నుంచి వైదొలగి మరింత పైస్థాయి స్ట్రైక్‌ప్రైస్‌ పుట్‌ను తీసుకోవడం జరుగుతుంది. పాత పుట్‌ను విక్రయించి కొత్త పుట్‌ను కొనుగోలు చేయడానికి కొంత లాస్‌ వచ్చినా, అది ఉన్న పొజిషన్‌ ఆర్జించే లాభంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యూహంలో అనూహ్యంగా షేరు ధర కదలితే తప్ప పెద్దగా రిస్కులుండవు. అయితే ఆప్షన్‌ సెల్లింగ్‌లో ఇలాంటి తరుణంలో భారీ నష్టాలకు అవకాశాలుంటాయి. అదేవిధంగా మనం షార్ట్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడు పుట్‌ స్థానంలో కాల్‌ తీసుకొని లాభాన్ని లాక్‌ చేసుకోవచ్చు. 

పైవన్నీ మార్కెట్‌ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు. పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

సుస్థిర ప్రభుత్వ ఆశలతో సెంటిమెంట్‌లో రికవరీ

Saturday 16th March 2019

మార్కెట్లపై సీఎల్‌ఎస్‌ఏ రాబోయే ఎన్నికల్లో స్థిరప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లో తాజాగా సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారేందుకు దోహదం చేశాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందన్న ఊహాగానాలతో పెట్టుబడి సెంటిమెంట్‌ పునరుజ్జీవమవుతోందని తెలిపింది. తాజా ఒపీనియన్‌పోల్స్‌లో బీజేపీ సీట్ల సంఖ్య మరో 30-40 వరకు పెరిగిందని తెలిపింది. దీంతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో కీలకమైన ప్రీపోల్‌ సర్దుబాటును బీజేపీ ప్రకటించిందని, దీంతో 6- 10 సీట్లలో గెలుపు

5నెలల గరిష్టం వద్ద ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 16th March 2019

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి లాభాలతో ముగిశాయి. టెక్నాలజీస్‌ షేర్ల ర్యాలీ ఇందుకు కారణమైంది. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 14పాయింట్లు పెరిగి 2,822.48 వద్ద స్థిరపడింది. ఇది ఈ సూచీకి 5నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 57 పాయింట్లు లాభపడి 7,688.53 వద్ద, డోజోన్స్‌ ఇండెక్స్‌ 139 పాయింట్లు ర్యాలీ చేసి 25,849 వద్ద ముగిశాయి. అమెరికా - చైనాల మధ్య జరిగిన వాణిజ్య

Most from this category