19 పైసలు బలపడిన రూపాయి
By Sakshi

డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ఎక్స్ఛేంజ్లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 19 పైసలు బలపడి 68.58 దగ్గర ప్రారంభమయ్యింది. దేశీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయి లాభాల్లో ప్రారంభంకావడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగి రూపాయి విలువ బలపడిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు తెలియజేశారు. సెన్సెక్స్ జీవితకాల గరిష్టస్థాయికి చేరుకోవడం, నిఫ్టీ 11,000 పాయింట్లను అధిగమించడం లాంటి సానుకూల వాతావరణానికి తోడు ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను అమ్మేందుకు క్యూ కట్టడం లాంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ బలపడిందని తెలియజేశారు. మరికాసేపట్లోనే ద్రవ్యొల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడికానున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ ముగింపు సమయానికి రూపాయి విలువ 5 పైసలు బలపడి 68.77 వద్ద నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మారకం విలువ ఏకంగా 7 శాతం పతనమయ్యింది.
You may be interested
గురువారం వార్తల్లోని షేర్లు
Thursday 12th July 2018ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు అశోకా బిల్డ్‌కాన్, జనరల్ ఇన్యూరెన్స్:- 2:1 నిష్పత్తిలో ఎక్స్-బోనస్ ప్రకటించాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్:- నేడు జరిగే బోర్డు సమావేశంలో బై-బ్యాక్ అంశంపై చర్చించనుంది. సిప్లా:- దక్షిణాఫ్రికాలోని తన అనుబంధ సంస్థ ద్వారా మిర్రేన్ సంస్థను రూ.228 కోట్లకు కొనుగోలు చేసింది. ఐడీఎఫ్సీ:- మధ్యంతర చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా రిన్కో సోమనీ నియమితులయ్యారు. హెచ్ఐఎల్:- జర్మనిలోని తన అనుబంధ సంస్థలో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్లు
సెన్సెక్స్ సరికొత్త రికార్డు
Thursday 12th July 201811,000 పాయింట్ల పైన ప్రారంభమైన నిఫ్టీ ముంబై:- మార్కెట్ గురువారం రికార్డ్ ర్యాలీతో మొదలైంది. ఆసియా మార్కెట్లు నుంచి అందిన సానుకూల సంకేతాలకు తోడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటంతో సూచీలు సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచి 158 పాయింట్లు లాభంతో 36424 వద్ద, నిప్టీ 59 పాయింట్లు లాభంతో 11000 పాయింట్లపైన 11,007 వద్ద ట్రేడింగ్‌ను షూరూ చేశాయి.